అక్షర

దాశరథి గీతాసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీత
- వచన వ్యాఖ్యానం-
-దాశరథి రంగాచార్య
వెల: రు.225/- ప్రతులకు: నవచేతన, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ల అన్ని బ్రాంచీలు
**
భారతదేశ తాత్విక గ్రంథములలో భగవద్గీతకు ఉన్నత ప్రచారము మరే గ్రంథమునకు లేదు అనటంలో ఎట్టి సందేహమూ లేదు. గీతను సంప్రదాయవాదులు ప్రస్థానత్రయములో ఒకటిగా చేర్చారు. పంచమ వేదము అనబడిన మహాభారతములో భగవద్గీత యుద్ధపర్వములకు ముందున్నది. ఇది 18 అధ్యాయముల గ్రంథము. అర్జున విషాద యోగముతో ప్రారంభమై పద్ధెనిమిదైన మోక్ష సన్యాసయోగముతో ముగుస్తుంది. ఈ గ్రంథము అర్జునుని పేరుమీద మానవాళికి శ్రీకృష్ణుడు అందించిన తాత్విక భాగము.
తెలుగులోను ఇతర భారతీయ భాషలలోను గీతపై వచ్చినన్ని వ్యాఖ్యానములు మరే గ్రంథముపై కూడా రాలేదు. ఇప్పుడు దాశరథి రంగాచార్యగారు గీతా వ్యాఖ్యానము ఉపదేశ గీత పేరుతో వెలువరించారు. రంగాచార్యగారు తొలి దశలో నవలా రచయితగా పేరొందిన తర్వాతి కాలంలో చతుర్వేద భాష్యము రామాయణాదులు రచించి ప్రసిద్ధికెక్కారు. ఈ ఉపదేశ గీత ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికంగా వచ్చింది. నిజానికి ఇది భగవద్గీతకు శ్లోకానువాదము కాదు. ఒక్కొక్క అధ్యాయం తీసుకొని అందలి భావమేమిటో స్థూలంగా చెప్పుకుంటూ వెళ్లారు. అంటే గీతాసారాంశము అని భావించారు. దానికితోడు గీత అంటే ఏమిటి? భారతీయ తాత్వికప్రస్థానం వేదోపనిషత్తులనుండి ఎలా ముందుకు సాగింది అనే అంశం కూడా పీఠికలో వివరంగా చెప్పారు. అంటే ఈ గ్రంథము సరళ వచనములో గీతా భావసారముగా భావింపవచ్చు.
దీనికి రచయిత దీపిక అని పేరు పెట్టారు.
సందర్భోచితంగా చిన్న చిన్న సంఘటనలు కథలు చెప్పి తన వ్యాఖ్యానాన్ని రంగాచార్యగారు రక్తికట్టించారు. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమంటే ఎక్కడా కాఠిన్యం లేకపోవడం అంటే సరళాతి సరళంగా కళాశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రచించడం. సామాన్యంగా శాస్త్రగ్రంథాలలో వాడే భాష పరిభాష ఇందులో లేదు. ఈ కారణంచేత దీనిని ఒక నవల చదివి ఆనందించినట్టే గృహస్థులు చదువుకోవచ్చు. దీనిని ప్రచురించిన నవచేతనవారు అభినందనీయులు. రచయిత అత్యాధునికుడు కావటంవల్ల జీన్స్‌నుండి వర్తమాన ఓట్ల రాజకీయాలవరకు ఎన్నో అంశాలు సామాజిక స్పృహతో అక్కడక్కడ స్పృశించారు. ఈ గ్రంథములు శ్రీకృష్ణపరమాత్మకు రచయిత అంకితం చేశారు. డా.మసన చెన్నప్ప, వి.జయప్రకాశ్‌గార్లు అందించిన పండితాభిప్రాయాలు సంక్షిప్తంగా ముక్తియుక్తంగా ఉన్నాయి.

-ముదిగొండ శివప్రసాద్