అక్షర

హృదయపు లోతుల్లోంచి పెల్లుబికిన కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గుడ్డివాడి
ఊతకర్ర చప్పుడే
అతడి గుర్తింపు కార్డు’’
అంటూ సరికొత్తగా, స్పందించేలా కవిత్వం రాయగల ‘‘సీనియర్’’ కవి ఎ.సూర్యప్రకాశ్, నగరం నీడలు, మళ్ళీ సూర్యోదయం, కాగితం పువ్వు వంటి కవితా సంపుటాలు సూర్యప్రకాశ్‌ను కవిగా సుస్థిరంచేశాయి. ఒకనాడు మినీ కవిత్వం ఒక ఉద్యమంలా సాగింది. మళ్ళీ ఈతరం కవులు దాని జోలికి అంతగా వెళ్ళడం లేదు. ఇన్నాళ్ళకి సూర్యప్రకాశ్ పూర్తిగా మినీ కవితల సంపుటి ‘‘నిశ్శబ్ద ధ్వని’’ వెలువరించారు.
‘‘దళారుల లాభాల బాటలో
రైతులు మాత్రం లబోదిబో
పాలే ఇవ్వదే ఇదేం గేదె
ఇదే ఇదే పశుక్రాంతి పథం’’
- ఇటువంటి సమకాలీన సమాజంపై చరువులు, వెక్కిరింతలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నిత్యసత్యాలే. తెలంగాణ రాష్ట్రోద్యమం గురించి రాసినవీ ఉన్నాయి. ఉదాహరణకి-
‘‘తొండలు ముదిరి ఊసరవెల్లులు
నిన్నటి ఉద్యమనేతలు నేడు రాష్ట్ర మంత్రులు
ఉద్యమాలు మంత్రి పదవులకోసమేనా?’’
అయితే ఇటువంటి సాదాసీదా పంక్తులు చాలా కనిపిస్తాయి. ఇక్కడ శిల్పం చూడకూడదు. వస్తువే ముఖ్యం. అనుబంధంగా అమెరికా గ్రంథాలయంలో చదివిన కవిత్వాన్ని చదివి వాటిని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసిన కవితలున్నాయి. ‘‘మూలంలోని హైకూలకంటే నా పైత్యమే ఎక్కువనిపించింది’’అని స్వయంగా కవే చెప్పుకొన్నారు.
‘‘మీరంతా నేనే’’ కవితా సంపుటిలో మొదటి కవిత ‘‘తెలంగాణను అమ్మేస్తుండ్రు’’ తెలంగాణ తెలుగులో చివాట్లుపెట్టినట్లు రాసింది-
‘‘ఎన్నికలప్పుడు తెలంగాణ పాట పాడ్తారు.
గెలిసినంక పార్టీ మారి
రెండు సేతులా దండుకుంటరు
కుర్సీ ఎక్కి ఖుషీ జేస్తరు’’
అనే విధంగా సరళంగా రాసిన ఈ కవిత వెనుక కుహనా రాజకీయాల నాటకాలు కళ్ళకి కడతాయి.
‘‘ప్రొద్దునె్న లేవాలి రైతన్నా
పొలమునకు పోవాలి రైతన్నా
నీవు లేకుంటేను రైతన్నా
దేశమూ నిలువదోయ్ రైతన్నా’’
అంటూ సూర్యప్రకాశ్ ఎనిమిదో తరగతిలో రాసిన తొలి కవితను ఇందులో చూస్తాం. అప్పటికే సామాజిక స్పృహ ఉన్నట్టు గుర్తిస్తాం. ‘‘ప్రకృతి చిత్రాలు’’అనే కవితలో కవిత్వ ఆరాటం వుంది, సౌందర్యదృష్టే వుంది-
‘‘ఆకాశంలో పసిపాప/ కిలుక్కున నవ్వినట్లు
మెరుపు మెరిసింది’’
‘‘ఆకాశాన్ని తామే స్వయంగా
మోస్తున్నట్లు పక్షులు/ రెపరెపా రెక్కలెగరేశాయి
నాలుగు దశాబ్దాలకు పైగా కవిత్వం రాస్తున్న సూర్యప్రకాశ్‌ది స్వీయ గొంతుక, స్వీయ శైలి గలది! సంక్లిష్టతకి చోటు లేని కవిత్వమిది.

-ద్వా.నా.శాస్ర్తీ