అక్షర

వేదాలకు వక్రభాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల వ్యవస్థ- నిర్మాణం- వేదాలు
(వచనము)
రచన: సత్యబత్తుల
వెల: రు.100/-
ప్రతులకు: 3
నవచేతన అన్ని బ్రాంచీలు.
**
ఇదొక అశాస్ర్తియ గ్రంథము. రచయిత పేరు సత్య. కాని పుస్తకం నిండా అసత్యాలే. అత్యంత ప్రాచీన సమాజములైన హిందూ-గ్రీకులలో గుణాత్మక వ్యవస్థ ఉండేది. అంటే సత్వగుణ సంపన్నులు విప్రులు. సాధనచేత అందరూ సాత్వికులు కావాలనేది ఒక లక్ష్యంగా భావించారు. తర్వాత కొంతకాలానికి వృత్తులనుబట్టి కులములు ఏర్పడ్డాయి. కులమునకు గుణమునకు సంబంధం లేదు. ఐతే కొన్ని శతాబ్దాలనుండి వర్ణవ్యవస్థ స్థానాన్ని కులవ్యవస్థ ఆక్రమించుకుంది. దీనివలన సమాజంలో త్రిగుణాత్మక భావజాలం లుప్తమై గందరగోళం మొదలైంది. ఇక రెండవ అంశం వేద వ్యాఖ్యానం. పండితులకే వేదమంత్రములకు అర్థం తెలియనప్పుడు సామాన్యులకు ఎలా తెలుస్తుంది? వాచ్యార్థమునుబట్టి కొందరు వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఐరోపానుండి పుట్టిన ఆధునిక భావజాలము వేదోపనిషత్తులపై దండయాత్ర చేసింది. మనువు ఒక యుగంలో రాజ్యాంగ నిర్మాత. ఆ తర్వాత ఎన్నో యుగములు గడిచిపోయి ఇవ్వాళ అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఐనా మనువును తిట్టడం ఒక ఫ్యాషన్‌గా మారింది. ఈ దశలో కొందరు భ్రమ ప్రమాదాలకులోనై గ్రంథ రచన చేశారు. అలాంటి పరంపరలో వచ్చిన మరొక గ్రంథమే 34కులవ్యవస్థ నిర్మాణం వేదాలు. రచయిత బత్తుల సత్య. ఆయనకు భారతదేశంలోని కుల వ్యవస్థపై కోపం ఉంది. దానిని ఈ గ్రంథంలో వ్యక్తంచేశారు. పీఠికలో మనుస్మృతి 2000 సంవత్సరాల నాటిది అని పేర్కొన్నారు. మనువు శ్రీరామునికన్నా పూర్వీకుడు. ప్రధానంగా బ్రాహ్మణ కులాన్ని నిందించటంకోసం ఈ గ్రంథం వ్రాయబడింది. ఆర్యులు విదేశాలనుండి ఇండియాకు రాలేదని ఇక్కడినుండే భిన్న దేశాలకు వెళ్లారని ఆధునిక పరిశోధనలు నిరూపించినా ఇంకా కొందరు మొండిగా ఆర్యులు విదేశీయులు అని వాదిస్తున్నారు. ఆర్య శబ్దం గుణవాచకమా? జాతి వాచకమా? ఆలోచించాలి. 107వ పుటలో పురుష సూక్తమంత్రానికి ఇందులో ఉన్న వ్యాఖ్యానం చదివితే రచయిత ఎంత తొందరపాటుతో విద్వేషంతో ఈ గ్రంథం రచించాడో తెలుస్తుంది. శాస్త్రగ్రంథాలు వ్రాయదలుచుకుంటే సత్వగుణము శాస్ర్తియ దృక్పధము సంయమనమూ అవసరం. అవి లేక రాజకీయ ప్రయోజనాలకోసం భావోద్రేకాలతో రచనచేస్తే ఇలాంటి పుస్తకాలే వస్తాయి. అడవుల్లో ఆర్యులు గుంపులుగుంపులుగా ఉండేవారు. వీరి నాయకుణ్ణి రాజన్ అనేవారు. వీరంతా సంచార జాతులు22 (13వ పుట) అడవుల్లో ఉండేవారిని వానప్రస్థులు అంటారు. వారు ఋషులు. సమాజానికి శాంతి అహింస బోధించేవారు. సతపత (104వ పుట) కాదు ఇది శతపథ అని ఉండాలి. 125వ పుటలో ఆంధ్రబృత్య అని ఉంది. ఇది భృత్య శబ్దం 14 మంది తుశారాలు అంటే ఏమిటి? గర్దబాలు, సాకాలు అంటే ఏమిటి? సంస్కృత పాండిత్యం లేకపోవటం తప్పుకాదు. కాని ఉన్నట్లు నటించటం సంస్కృత శ్లోకాలకు దుర్ వ్యాఖ్యానాలు చేయటం మాత్రం తప్పు. ఇందులో ఒక్క శ్లోకమూ తప్పులులేకుండా లేదు. అన్ని మంత్రాలకూ దుర్ వ్యాఖ్యానమే చేయబడింది. ఈ వ్యాసాల వాక్య నిర్మాణంబట్టి ఏవేవో ఇంగ్లీషు గ్రంథాలకు అనువాదం అని తెలుస్తున్నది. కాన్యరాజులు నలభై ఆరుగురు- ఇక్కడ కాణ్వరాజులు అని ఉండాలి. అంటే రచయితకు సంస్కృత భాషలోనే కాదు తెలుగు భాషలో కూడా తగిన పరిచయం లేదు. ఇస్లామిక్ సమాజంలోని ఖురాన్‌ను విమర్శిస్తూ ఈ రచయిత ఇలాంటి గ్రంథం వ్రాయగలడా?

-కృష్ణమూర్తి