అక్షర

సామాజిక సమస్యలకు విభిన్న కోణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు కడలివైతే
-నండూరి సుందరీ
నాగమణి
వెల: రూ.150లు
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాల్లో
**

ఇటీవలి కాలంలో విరివిగా కథలు, నవలలు రాస్తున్న రచయిత్రుల్లో నండూరి సుందరీ నాగమణిని ప్రధానంగా పేర్కొనాలి. వీరి కథల్లో జీవితంలోని వివిధ కోణాలు, నిత్య జీవితంలో తారసపడే అనేకరకాల మనస్తత్వాల వ్యక్తులు కనిపిస్తుంటారు. వస్తువు ఎక్కడినుంచో వెదికి తెచ్చుకునేదికాక, దైనందిన జీవితంలో ఎక్కడో అక్కడ, ఎవరికో ఒకరికి ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుందనిపిస్తుంటుంది. పాత్రలు నేలవిడిచి సాముచేసేవిగా ఉండవు.. సహజత్వానికి దగ్గరగా ఉంటాయి.
నువ్వు కడలివైతే కథా సంపుటిలోని కథలు దాదాపుగా అన్నీ కూడా సహజత్వానికి దగ్గరగానే ఉన్నాయి. ఆనంద గోదావరి, అరవిరులు, అడగని వరం, రోమియో, రెండో బాల్యం, మూడో చపాతీ, నేను సైతం మొదలైన 22 కథలున్నాయి.
ఈమె గోదావరి జిల్లా ప్రాంతానికి చెంది ఉండడంవలన ఆనంద గోదావరి లాంటి కథలో గోదావరి ఒడ్డుని, ఆ వాతావరణాన్ని ఎంతో అందంగా, ఆహ్లాదంగా వర్ణిస్తూ రాసిన కథ. నిధి అనే పేరుగల ముప్ఫై సంవత్సరాల అల్ట్రామోడరన్ యువతి ఆశ్రమవాసి అయిన మురళీధరరావును కలుసుకుని, ఒకనాటి అతని ప్రేమగాథ తెలుసుకోవాలనుకోడం వస్తువు. ఆ ప్రేమకథలో తన తల్లి ప్రధానపాత్ర కావడం విశేషం.
అలాగే రోమియో అనే కథకూడా విశాఖపట్నం రామకృష్ణా బీచి అందాల్ని వర్ణిస్తూ సాగుతుంది. ఈ కథలో రచయిత్రి అయిన నాయిక మంచి మూడ్‌కోసం సముద్రం ఒడ్డుకి రావడం, అక్కడ ఒక రోమియో తననే చూస్తూ ఉండడం చూసి అపార్థం చేసుకోడం జరుగుతుంది. కానీ, అతను అంధుడని తెలుసుకున్న తరవాత ఆమెలో పశ్చాత్తాపం కలుగుతుంది. చిన్న కథ అయినా మంచి కథ.
అరవిందులు అనే కథలో అత్యాచారానికి గురైన స్నేహితురాలిని తన విధి నిర్వహణలో భాగంగా, ఒక స్నేహ ధర్మంగా రక్షించిన విరాజిత ఆ జాస్మిన్‌తో నీ డ్రెస్ మగవాళ్లని రెచ్చగొట్టేదిగా ఉంది అందుకే నీ మీద అత్యాచారం జరిగింది అనే అర్థం వచ్చేలా మాట్లాడుతుంది. పదహారేళ్ల అమ్మాయిలు పరికిణీ ఓణీల్లో ముద్దబంతుల్లా అందంగా ఉంటారు.. యువతులు, ప్రౌఢలు చీరల్లో మరింత సొగసుగా ఉంటారు.. నిజమే, కానీ, కాలంమారి వేగంగా పరుగులుతీస్తున్న ఈరోజుల్లో తమతోటి వారితో పోటీపడుతూ, చదువుల్లో ఉద్యోగాల్లో అత్యున్నత స్థానం సాధించడానికి నిత్యం పరుగులు పెట్టాల్సిన పరిస్థితుల్లో చీరలు కట్టుకుని ఆ కుచ్చిళ్లు పాదాలకు అడ్డం వస్తుంటే ఎంత అసౌకర్యానికి గురవుతారో అమ్మాయిలు ఊహించగలం. ఇటీవల ఈ వస్తధ్రారణ విషయంలో బాధ్యతగల వ్యక్తులు చేసిన విమర్శల పట్ల తీవ్రంగా స్పందించారు అమ్మాయిలు.. ఇది అందానికన్నా అవసరానికి ప్రాధాన్యతనిచ్చే రోజులు కాబట్టి అమ్మాయిలను సంప్రదాయబద్ధమైన వస్తధ్రారణ చేయండి అని నిర్భంధించడం వారి ప్రాథమిక హక్కులను కాదనడం అవుతుంది. సామాజిక స్పృహతో రాసిన కథ నేను సైతం.. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో లేడీస్ టాయిలెట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వకపోడం ఎప్పటినుంచో సాగుతోంది. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినిలు ఈ అంశంపైన పెద్ద ఉద్యమం కూడా చేయడం జరిగింది. అయినా లేడీస్ టాయిలెట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని అటు ప్రభుత్వమూ, ఇటు ప్రైవేటు సంస్థలు కూడా గుర్తించలేదు. ఇటీవల ఉత్తరాదిలో ఒక పెళ్లికూతురు అత్తగారింట్లో టాయిలెట్ లేదని, టాయిలెట్ లేకపోతే కాపురానికే రానని వెళ్లిపోయిన సంఘటనతో ప్రతివారిలోనూ కొంత చలనం కలిగి, లేడీస్ టాయిలెట్స్ నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి టాయిలెట్స్ అవసరం స్ర్తిలకి అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ సమస్య ఎంత తీవ్రంగాఉన్నా స్ర్తిలు తను బాధను వెల్లడించడానికి సిగ్గుపడుతూ వౌనంగా భరించడం మనందరికీ తెలుసు.. నాగమణిగారు ఈ సమస్య తీవ్రతని గమనించడమేకాక, ఒక కథగా మలచి అందరి దృష్టికీ తీసుకురావడం అభినందించదగిన విషయం. ఇలాంటి అనేక కుటుంబ, సామాజిక, వ్యక్తిగత సమస్యలను కథావస్తువులుగా స్వీకరించి ఆసక్తికరంగా కథలుగా మలచి ఈ సంపుటిలో అందించారు రచయత్రి.

-అత్తలూరి విజయలక్ష్మి