అక్షర

సహజ పరిమళాలు తెలంగాణ పలుకుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ పలుకుబడులు సామెతలు
-చిందం సునీత
వెల: రు.100/-
ప్రతులకు: సిహెచ్ సునీత
ఇంటినెం.6-3, కోడం వీధి,
తంగళ్లపల్లి
కరీంనగర్- 505 405
--

వృత్తి పదకోశ ఆధారంగా తెనుగు నాడును భాషా శాస్తవ్రేత్తలు నాలుగు భాషా మండలాలుగా విభజించారు. తెలంగాణ ఉత్తర భాషా మండలంలోకి వస్తుంది. చిందం సునీత తెలంగాణ పలుకుబడులు, సామెతలను సేకరించారు. ఒక వేయి నాలుగు వందలయాభై పలుకుబడులను అక్షరక్రమంలో అందించారు. ఎనిమిది వందలకు పైగా సామెతలను సేకరించారు. పదాలకు అర్ధానిచ్చి అవి మూల భాషకు ఎంత దగ్గరగా వున్నాయో తెలిపారు. తెలంగాణ పదాల్లో చాలా పదాలు అనుస్వారంతో కూడి ఉంటాయి. అనుస్వారంతో వున్న పదాలు నాదమయవౌతాయి. నాగుంబాము, తాంబేలు వంటివి. ఇందులోని సామెతలు తెలంగాణ గ్రామీణ ప్రజానీకం నోట్లో నానినవే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఈ సామెతలు తెలియజేస్తున్నాయి. గతంలో ఆచార్య రవ్వా శ్రీహరి నల్లగొండ జిల్లా మాండలిక పదకోశాన్ని వెలువరించారు. తెలంగాణ భాషకు ఆయన వ్యాకరణాన్ని రూపొందించారు. తెలంగాణ పదాలతో కూడిన కావ్య ప్రయోగాలను ఆయన చూపారు. ప్రభుత్వం చేయవలసిన పనిని ఒంటి చేత్తో ఆయన చేసారు. తరువాత నలిమెల భాస్కర్ మాండలిక పదకోశాన్ని రూపొందించారు. తెలంగాణ బాస ఒక్కో జిల్లాలో ఒక్కో తీర్గ ఉంటది. హైదరాబాద్ ప్రాంతంలో వేరుశెనగ కాయలను పల్లీలంటారు. నల్లగొండ జిల్లాలో ఇలాత్ కాయంటారు. విలాయత్ నుంచే ఇలాత్ వచ్చింది. విలాయత్ అంటే విదేశం. పాన్ డబ్బను నిజామాబాద్‌లో కోక్ అంటారు. మోరీని గటేరంటారు. గటర్ నుండి గటేర్ వచ్చి ఉండొచ్చు.
కందిలి అంటే చిన్న దీపం కాదు. లాంతరే. చిన్న దీపం ఎక్క. ఎక్క బత్తి ఏకాన. కందిలిబత్తి దొవ్వాన అంటూ అమ్మేవారు. కుల్లా కుల్లా అంటే వివరంగా.లస్కర్ అంటే పట్నం కాదు. హైదరాబాద్‌నే పట్నమంటారు. లస్కర్ అంటే సికింద్రాబాద్.సైన్యం ఉండడంవల్ల ఆ పేరు వచ్చింది. కొయ్ గూరంటే గోంగూరకాదు. పుంటికూర అంటే గోంగూర. కరీంనగర్ జిల్లాలో ఏదాది వకారాన్ని అకారంగా మార్చి వడ్లు, అడ్లు, వంకాయ,అంకాయ అని అంటారు. ఈ పుస్తకంలో తెలంగాణ పదాలకు సరైన అర్ధాలిచ్చారు. గతిలేనమ్మకు గంజే పాన్కం, పేగు బంధం పెరికేసినా పోదు, వంకర టింకతో వయసే చక్కన వంటి సామెతలిచ్చారు. ఊయగాలదు-పీరీలు లెవ్వయి సామెతకు వివరణ ఇస్తే బాగుండేది. ఈ సందర్భంగా పీర్ల పండుగ గురించి రాస్తే బాగుండేది. పేరుకే ఊదు వేస్తారు. ఊదు పొగవేసి డప్పులు కొడుతూ హస్సమే ధులా అంటేనే పీరు లేస్తుంది. పీరులెత్తుకొన్న వాడికి శిగమొస్తుంది. పని కావాలంటే దేవునికైన లంచమివ్వక తప్పదని దీని అర్ధం. తెలంగాణ పలుకుబడుల సామెతల సేకరణలో చిందం సునీత చేసిన ప్రయత్నం హర్షించదగ్గది.

-తెలిదేవర భానుమూర్తి