అక్షర

అఖిలాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిలాశ
-జాని బాషా చరణ్
తక్కెడశిల
వెల: రూ.50
ప్రతులకు: రచయిత
ఇం.నెం.3-4-173-ఎ
శివాలయం స్ట్రీట్
పులివెందుల
వైఎస్‌ఆర్ కడప-516 390
7259511956

మనసున మెదిలే భావాలకు రూపమిచ్చి, అందమైన పదాల అమరికతో హృదయాలకు హత్తుకునేలా చెప్పగలవారే కవులు. ముందు తరాలకి తియ్యని తెలుగు అందించలేమేమో అని అనుకుంటున్న సమయంలో యువత తెలుగు భాష మీద చూపిస్తున్న మక్కువ ఎంతో ముదావహం. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జన్మించిన, నాచన సోమన, అల్లసాని పెద్దన, రామరాజభూషణుడు, వేమన వంటి మరెందరో కవులకు కాణాచి అయిన కడప జిల్లా నుండి వచ్చిన, తెలుగు సాహిత్యాకాశంలో మరొక కవి జాని. కవి హృదయం నిత్య జీవితంలో ఎదురైన ప్రతీ సంఘటనకీ, అంశానికీ స్పందిస్తుంది. అఖిలాశ (కలం పేరు) కూడా అంతే. ఇతని కవితలకి అందని కవితా వస్తువు లేదు. తొలి కవితలో పెళ్లికూతురి భావావేశాలను, పెండ్లి పిదప మాతృత్వ సౌభాగ్యాన్ని, మాంగల్య ప్రాధాన్యతను అందమైన పద సమూహంతో వర్ణిస్తూ చదువరుల మనసులను ఆకట్టుకుంటాయి. ‘అమ్మతనపు కమ్మదనాన్ని రుచి చూడ’మంటూ కనె్నపిల్లలకి ఆశలు కల్పిస్తాయి. ఇలాంటివే అన్ని కవితలూ. చివరగా సమాధి అంటే కొత్త నిర్వచనం చెప్తూ ఈ కవితాఝరికి ఆనకట్ట వేస్తాడు. *