అక్షర

నానీల కవితా రూపానికి మంచి చేర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానీ కెరటాలు -హర్షవర్థన్
వెల: రూ.50/-
ప్రతులకు: 9949992880
**
‘నేను రాసిన నానీలు జీవితానుభవాల నుంచి, మిత్రుల సంభాషణల నుంచి పుట్టినవే. ఆత్మానందానికి రాసుకున్నవీ ఉన్నాయి’ అని గుండె విప్పి చెప్పుకున్నారు హర్షవర్థన్. విశాఖపట్టణంలో ఎం.ఏ. మొదటి సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేనున్న హాస్టల్ పేరు ‘హర్షవర్థన్’ గుర్తుకు వస్తోంది. ఎటువంటి భేషజాలు లేని కవిలాగానే, ఈ నానీలు కూడా స్వచ్ఛంగా, సహజంగా వెలువడ్డాయని తెలుసుకుంటాం. ఎన్.గోపి గారి ప్రేరణతో ఈ నానీలు వెలువడ్డాయి.
ఇవాళ కార్పొరేట్ సంస్థలు నూటికి రెండువందల పాళ్లు భారీ వ్యాపారాత్మకాలే. అందరూ ఈ బాధలు అనుభవించేవాళ్లే. వీటిని కవి మాత్రమే లోకానికి అందించి ఆలోచింపజేస్తాడు.
‘రోగుల రక్షణ కోసం/ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/ అదే ఇవాళ్టి/ ఇన్‌సెంటివ్ కేర్ యూనిట్’ దీన్ని కాదనగలమా?
గవర్నర్, చైర్మన్ పదవులు రాజకీయాలకు గులాముగా మారాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి, బుజ్జగింపు పర్వాలు వల్ల పదవులు భ్రష్టు పడుతున్నాయని విద్యావంతుల, సామాజికుల అంతరంగ వేదన. శ్రీశ్రీలాగా కవి అందరి బాధను తన బాధగా మలుస్తాడు గదా! అందుకనే-
‘రాజకీయాల్లోనూ/ కన్సొలేషన్ బహుమతులు/ గవర్నర్, ఛైర్మన్/ అవే బాపతులు’ అంటారు హర్షవర్థన్.
కన్సొలేషన్ అంటే ఓదార్పు లేదా బుజ్జగింపు. అంత్య ప్రాస కూడా కుదిరింది. బహుళ జాతి కంపెనీల వాణిజ్య బడారుూలను వాణిజ్య శాఖలో పనిచేసిన హర్షవర్థన్‌కి తెలీవా?
‘అరకు కాఫీకి/ అంతర్జాతీయ ఖ్యాతి/ అరకు సవరలకు/ అంటువ్యాధులే గతి’ అనకుండా, మనల్ని మేల్కొల్పకుండా ఎలా ఉంటారు. ఒక మంచి నానీల సంపుటి చదివామన్న తృప్తి పాఠకుల్లో కలుగుతుంది.

-ద్వానా శాస్ర్తీ