అక్షర

కొత్త కోణంలో ‘జీవనగీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోణంలో గీతా రహస్యాలు
‘జీవనగీత’ (మొదటి భాగం)
-డా.వాసిలి వసంతకుమార్
వెల: రూ.200.. పుటలు: 240
ప్రతులకు: యోగాలయ, ప్లాట్ 90,
కృష్ణా ఎన్‌క్లేవ్, ఎం.డి.్ఫమ్ రోడ్,
తిరుమలగిరి, సికిందరాబాద్- 500 015
9393933946
*
డా.వసంతకుమార్ పదికిపైగా వివిధ విషయాలపై ఇరవై గ్రంథాలు రచించారు. పత్రికలలో కొన్ని వందల వ్యాసాలు ప్రకటించారు. అటువంటి వ్యాసాలే కొన్ని తరువాత పుస్తకాలుగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలు చదివిన వారెవరైనా డా.వాసిలి ఇతర రచనలు చదవాలని ఉత్సుకులౌతారు. ఎందుకంటే వసంతకుమార్ రచనలలో ఇహపరాలకు సంబంధించిన, ముఖ్యంగా వర్తమాన జీవితానికి కావలసిన అనేకానేక విషయాలు పొందుపరచబడి ఉంటాయి. ముఖ్యంగా నేటి యువతకు గైడ్ లైన్స్.
ఒక విషయాన్ని గూర్చి చెప్పాలంటే దాని లోలోపలికి చొచ్చుకుపోయి, దానిని పొరలా విప్పి, పరిశీలించి, పరిశోధించి, శస్త్రం (డిసెక్ట్) చేసి చక్కని వివేచనతో తనదైన శైలితో ఒక సిద్ధాంతాన్ని - ఎవ్వరూ కాదనలేని రీతిలో ప్రతిపాదిస్తారు డా.వాసిలి- తన ప్రతి పుస్తకంలోను. ఒక సందర్భం వివరణ తరువాత-
‘సాధ్యం అనుకొంటే అన్నీ చేజిక్కుతాయి.
అసాధ్యం అనుకుంటే ప్రతిదీ చేజారేదే.
సాధ్యం అనుకోగలిగితే కాకుండా పోయేదేదీ లేదు.
అసాధ్యం అనుకొంటే దొరికేదేదీ దొరకదు.
సాధ్యం అనుకోగలిగితే పెరుగుతుంటాం
అసాధ్యం అనుకొంటే తరుగుతుంటాం’

‘ప్రొఫెషనల్ నుంచి పర్సనల్ కాకూడదు.
వృత్తి ధర్మంలో వ్యక్తి ధర్మాన్ని కలపకూడదు.’ అంటారు.
కొత్త కోణంలో గీతా రహస్యాలు - మొదటి భాగం ‘జీవనగీత’లో అర్జున విషాద యోగ సందర్భాన్ని ఉటంకించిన తరువాత.
డా.వాసిలి రచన లన్నిటిలోను ఉత్తమోత్తమమైనది ‘కొత్త కోణంలో గీతా రహస్యాలు’. ఆ మాటకొస్తే ఈ రచయిత గ్రంథాలన్నిటిలోను గీతాప్రవచనం కనపడుతూనే ఉంటుంది.
‘ఈ పవిత్ర గ్రంథంలో విశ్వజనీన సత్యాలు, సమకాలీన ఉపయుక్త ధర్మాలు కనిపిస్తుంటాయి. కాబట్టి గీత సార్వకాలిక ప్రామాణిక గ్రంథం.. సర్వులకూ సర్వత్రా మార్గదర్శి.’
మరో గ్రంథంలో-
‘మొత్తానికి సకల ధర్మానుసారంగా గీత మిగిలిపోయింది. అయినా తలకెక్కించుకొని మన గీతల్ని మనం చెరిపేసుకోలేకపోతున్నాం. గీతలో ఒక ఫిలాసఫీ ఉంది. ఒక సైకాలజీ ఉంది. ఒక ఆంత్రొపాలజీ ఉంది. మన తత్వాలనూ, వ్యక్తిత్వాలను, మానవ పరిణామాన్ని, చరిత్రగతిని మార్చగల రహస్యాలున్నాయి’ అంటారు. అంతెందుకు డా.వాసిలిలో అణువణువునా గీత జీర్ణించుకు పోయింది.
వీరి రచన ఒక్కటి చదివిన వారెవరికైనా ‘కొత్తకోణంలో గీత’ చదవాలన్న సంకల్పం కలిగి తీరుతుంది. ఫలితంగా దానిచే ప్రభావితులై తమ జీవితాలను కొంతలో కొంతైనా తీర్చిదిద్దుకుంటారు. డా.వాసిలి ఇతర రచనలన్నీ ఒక ఎత్తయితే ఈ గ్రంథం ఒక్కటే ఒక ఎత్తు.
గీతలో కృష్ణపరమాత్మ చేసిన బోధలను నేటి యువతరానికి సులువుగా మనసులో నాటుకొనేటట్లు చెప్పడానికి రచయిత ఒక మంచి టెక్నిక్‌ని ఎంచుకున్నారు.
తనకు ఎవరెవరితోనో ఏర్పడిన సందర్భాలను పురస్కరించుకుని (లేక కొన్నిటిని సృష్టించుకొని) వారితో జరిగిన సంభాషణలు ఆధారంగా గీతాచార్యుడు చెప్పిన జీవిత సత్యాలను, జ్ఞాన బోధలను, జీవితాన్ని ఆనందమయం, విజయవంతం చేసుకోవడానికి అవసరమైన అంశాలను పరోక్షంగా, అవలీలగా అర్థమయేలా చెప్పడం. అలా ఆయా ధర్మాలను వేద సమ్మతంగా కాకుండా నవలల్లో వలె... తన సంభాషణా చాతురితో చెప్పటం. ఈ టెక్నిక్ చాలా హృద్యంగా ఉంటుంది.
ఈ సంభాషణలు మాధ్యమంగా చెప్పిన ఆణిముత్యాలు టూకీగా - సంభాషణంతా అయిన తర్వాత-
‘ఎస్ చైతన్యా! నువ్వు చెబుతున్న అంశాలన్నింటినీ భగవద్గీతలో చూడగలం. ఆర్ట్ ఆఫ్ లివింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సోషల్ స్టేటస్, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, పీస్ ఫుల్ రిటైర్‌మెంట్ - అన్నీ ఉన్నాయి గీతలో’.
‘మన జీవితానికి మనమే బాధ్యులం అన్నది చాలా ఉన్నతమైన ఆలోచనా సరళి. దీనే్న ‘ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ’ అంటాం.’
‘కాబట్టి ప్రకృతిలో పాజిటివ్‌గా స్పందించగలిగితే మనకు తిరుగుండదు. నెగెటివ్‌గా స్పందిస్తే మాత్రం మనం కష్టాల కూడలిలో చతికిలపడాల్సిందే. కాబట్టి మన బుద్ధి, మన దేహం - మన అధీనంలో ఉండడం అవసరం.’
‘మీరన్నట్లు నెసిసిటీస్ అండ్ ఆపర్చ్యునిటీస్ మాత్రమే కాదు.. లవ్ అండ్ కంపాషన్ కూడ జీవితం సంతృప్తిగా సాగటానికి ఎంతో అవసరం.’
‘ఆనందించే నేర్పు మనలో ఉంటే జీవితం రక్తి కడుతుంది. మన ధర్మాలను, కర్మలను రచించుకోవలసింది మనమే.’
డా.వాసిలి విరాట్ తత్వం - మానవ తత్వాల గురించి చెబుతూ- ఇలా విశే్లషిస్తారు.
‘ప్రధాన పాత్రలైన కృష్ణుడు, అర్జునుడు ఇలా కనిపిస్తారు - కృష్ణుడిది విరాట్ తత్వం - అర్జునుడిది మానవ తత్వం.
కృష్ణుడిది ప్రత్యగాత్మ - పార్ధుడిది దేహాత్మ
కృష్ణుడిది అనంత చైతన్యం
- విజయుడిది వ్యక్తి చైతన్యం.
కృష్ణుడిది అస్తిత్వం - అర్జునుడిది ఉనికి
కృష్ణుడు నిరహంకారి - అర్జునుడు అహంకారి.
కృష్ణుడు కర్తృత్వాపేక్ష లేనివాడు - అర్జునుడు ఫలతృష్ణ కలవాడు.
కృష్ణుడిది ఆద్యంతాలు లేని మూల ప్రకృతి
- అర్జునుడిది చలించే ప్రవృత్తి.
కృష్ణుడు అనంత పరిణామానికి శిల్పి
- అర్జునుడు అంతమయ్యే పరిణామానికి రూపం.
కృష్ణుడిది జ్ఞాన వర్ఛస్సు - అర్జునుడు జ్ఞాన కిరణం.
కృష్ణుడిది చైతన్యం, శక్తి, ప్రకృతి కలిసిన అద్వితీయ స్థితి-
పరబ్రహ్మ స్థితి -
అర్జునుడిది భావోద్వేగ చైతన్య స్థితి.
మొత్తానికి భగవద్గీతలో కృష్ణుడు బింబమైతే అర్జునుడు ప్రతిబింబం.
ఆమూల ప్రకృతి ప్రతిబింబాలు కావటమే ‘గీతా రహస్యం’
ఎంత అద్భుతమైన విశే్లషణ! ఇలా సుబోధకంగా చెప్పగలగటం, సామాన్య మేథకు సాధ్యం కాదు.
మరొక ఆణిముత్యం-
‘మనమే ఇహమూ పరమూ. మనతోనే భౌతిక అంశ.
ఆధిభౌతిక అంశ ఉన్నాయి. అంతే - ఇహపర సంయోగ అంశనే మానవ జన్మ’
చివరగా గీతా ప్రాశస్త్యాన్ని గూర్చి డా.వాసిలి మాటల్లోనే-
‘్భగవద్గీతను ఆచరణలో పెట్టగలిగితే మనసు ఉన్నతం అవుతుంది. వర్తనం శుభప్రదం అవుతుంది. జీవితం అనిర్వచనీయ అనుభూతిని మిగుల్చుతుంది. అంతెందుకు - ఏక వాక్యంలో చెప్పుకోవాలంటే - జీవించటానికి కావలసిన జీవశక్తి మననుండే పుట్టుకొస్తుంది. ధర్మం, సౌఖ్యం, భక్తి, మోక్షం, ఆత్మయోగం, కర్మ వేదాంతం - వీటి సంకలనమే గీతోపదేశం. ఇది అక్షర రూపంలోని మానవేతిహాసం.’
ఇవన్నీ కరిగించిన బంగారు ద్రవంలో నెమలి ఈకను ముంచి, పూ పరిమళాలను అద్ది, మన జీవన యానంలో చిత్రించుకోవలసిన - యేమనను...?
‘మనసా, వాచా, కర్మణా గత మా‘నవ’ గతి కావాలి’ అని ఆశిస్తారు డా.వాసిలి వసంతకుమార్.
వాసిలి రచనలలో చక్కని రీడబిలిటీ ఉంది. విలక్షణము, స్వతంత్రము అయిన ఆలోచనా సరళి. అంతేకాదు అర్థవంతమైన శీర్షికలు. హృద్యమైన శైలి. జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన విజయ గీతలు. సరళమైన భాష, సుబోధకమైన ఎక్స్‌ప్రెషన్, విషయానికి తగ్గ ప్రెజెంటేషన్ ఆయన సొత్తు.

-బాలాత్రిపుర సుందరి శోభిరాల