అక్షర

మరల ఇదేల రామాయణంబన్నచో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్పవృక్షము - రామాయణ కథలు - వచనము
-విశ్వనాథ శోభనాద్రి
వెల: రూ.500
ప్రతులకు: వేదమాతరం పబ్లికేషన్
16-2-836-బి-3 ఎల్‌ఐసి కాలనీ, సైదాబాద్
హైదరాబాద్- 500 059.

** ** ** *** *****

వాల్మీకి నుండి విశ్వనాథ వరకు రామగాథకు ఎందరెందరో ఎన్నో విధాలుగా ఆలంకారికంగా వ్యక్తీకరిస్తూనే ఉన్నారు. ఐనా ఏదో ఒక కొత్త పద్ధతిలో మరొక గ్రంథం వస్తూనే ఉంది. ఇందుకు కారణం భారతీయులనే కాదు మొత్తం మానవాళిని ప్రభావితం చేసిన గ్రంథాల్లో రామాయణం ప్రధానమైనది. ఇండోనేషియాలో రాముడికి గుడులు కట్టడం ఇందుకు ఒక ఉదాహరణ. ఇటీవల ‘కల్పవృక్షము - వాల్మీకి రామాయణ కథలు’ అనే పేరుతో బ్రహ్మశ్రీ విశ్వనాథ శోభనాద్రిగారు ఒక గ్రంథాన్ని వెలువరించారు. ఇది చాలా విలువైన కాగితంపై ఖరీదైన బైండింగ్‌లో వచ్చింది. రామాయణాన్ని కథలు కథలుగా విడదీసి చెప్పడం ఇందలి ప్రత్యేకత. శోభనాద్రిగారు విశ్వనాథ సత్యనారాయణ గారి వంశంలోనివారే. కాబట్టి అది పద్య కల్పవృక్షం అయితే ఇది వచన కల్పవృక్షం అనుకోవచ్చు.
‘నమామి వేదమాతరం’ పేరుతో వీరు ఒక పత్రికను నడుపుతున్నారు. ఇప్పుడు ధర్మప్రచార బుద్ధితో ఈ గ్రంథ ప్రచురణ చేసినట్లు ‘ప్రవర’లో చెప్పుకున్నారు.
సరళ వ్యావహారికంలో వర్ణ సచిత్ర గ్రంథంగా దీనిని రూపొందించటంతో ప్రధానంగా విద్యార్థులను ఆకర్షించాలనే భావం రచయితకు ఉన్నట్లు సుస్పష్టం. పాండిత్య ప్రకర్షకు కాక కథా కథనానికి ఇందులో రచయిత పెద్ద పీట వేశారు. వివిధ ఘట్టాలలోని కథలతోబాటు మాంధాత, వృత్రాసురుడు, లవణాసురుడు, అగస్త్యుడు, నృగమహారాజు వంటి కథలను విడివిడిగా సంగ్రహంగా చెప్పటం జరిగింది. కల్పవృక్షం సమస్తమైన కోరికలను తీర్చినట్లే ఈ కథలు మానవుల సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపుతాయని రచయిత ఆశించటం యధార్థమే. రచనలోను ముద్రణలోనూ ఇదొక మెరుగైన రామాయణం. గట్టు నారాయణ గురూజీ, కల్వకుంట చంద్రశేఖరరావు, సామవేదం షణ్ముఖశర్మ వంటి ప్రముఖులెందరో ఈ గ్రంథానికి ‘కితాబు’ నిచ్చారు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్