జాతీయ వార్తలు

మైనారిటీలకు వ్యతిరేకం కాదు : అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనమైన పౌరసత్వ బిల్లును నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లోకసభలో ప్రవేశపెట్టారు. ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుపై ఈ రోజే చర్చ, ఆమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును చదివి వినిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయరాదని చెప్పారు.అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లు దేశంలోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నదే కానీ మరొకటి కాదన్నారు.
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్ కే ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ మతం ఆధారంగా పౌరసత్వ హక్కును కల్పించడం దేశ లౌకికవాద వ్యవస్థకు విరుద్ధమని ఆరోపించారు.
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ అమిత్ షా పేరును హిట్లర్‌తోపాటు గుర్తుంచుకుంటారన్నారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి మతపీడనకు గురై అక్కడి నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సిలు, క్రైస్తవును అక్రమ వలసదారులుగా పరిగణించరు.టీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ, ఈశాన్య రాష్ర్టాల ఎంపీలు, ఏఐయూడీఎఫ్ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయనున్నారు.