జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై కాంగ్రెస్ విధానం స్పష్టంచేయాలి:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాదం సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని స్పష్టం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేశారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ పూల్వామా ఉగ్రదాడి జరిగిన తరువాత పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానికి దళాలు జరిపిన దాడిని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ సలహాదారుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా మండిపడుతూ పలు ప్రశ్నలు సంధించారు. అసలు భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయం లేదని భావిస్తున్నారా? పూల్వామా ఉగ్రదాడిని సాధారణ ఘటనగా పరిగణిస్తున్నారా? ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్ వైమానికి దాడులు జరుపకూడదా? అసలు ఉగ్రవాద సమస్యను చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? అని అంటూ పలు ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఉగ్రవాదాన్ని ఉపేక్షించట్లేదు. దేశ భద్రత విషయంలో బీజేపీ మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలదని చెప్పగలమని అన్నారు.