సాహితి

అమ్మ కూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యిప్పుడు నాకేం పనిలేదు
ఆ ఉయ్యాల చుట్టూ పరిభ్రమించడం తప్ప
ఏడుస్తే ఎత్తుకోవడం
నవ్విస్తూ ఆడుకోవడం

దగ్గరగా కనబడితే
నడుము నాట్యం చేస్తుంది
చేతుల్లో ఎన్ని భంగిమలో!
ముట్టుకుంటే... గలగలా నవ్వుల కేరింతలు
దూరంగా జరిగితే
ఏడుపుల రాద్ధాంతాలు

ఒకప్పుడు మా అమ్మకూడా యింతే
పెద్ద వయస్సేం కాదు
ఎనభై ఆరుకు అటూ యిటుగా
పసితనానికి దగ్గరగా
అందరూ తననే పట్టించుకోవాలని
అన్ని స్పర్శలు తనకే స్వంతం కావాలని
అందుకే... కాబోలు
మంచం మీంచి అంతర్థానమై
ఉయ్యాల్లో ప్రత్యక్షమయింది.

ఎత్తుకుంటానా
నా బుగ్గల్ని పువ్వుల్తో పామాడినట్టు
అచ్చం మా అమ్మ చేతుల్లాగానే
మా అమ్మే నన్ను ఎత్తుకున్నట్టు
ఆ చిన్ని నోట్లోంచి అమృతం
నా ముఖం మీద చిలకరిస్తుంది
బట్టల్ని తడిపి కిలకిలా నవ్వుతుంది
అదేమిటో...
ఎత్తుకోందే ఆ పని కానిచ్చేది కాదు.

నేనూ అంతేనట
అమ్మ చీర ఎప్పుడూ పొడిగా వుండేది కాదట
నా ఊహ విచ్చుకోక ముందటి ఊసులు
దోసిళ్ళతో ఒంచేది
యిప్పుడా చంటిది
ఊ...ఆ... అంటుంటే
మా అమ్మ కబుర్ల లాగే తోస్తుంది.

మామయ్యగారి సంబురం
కోడలికి మహా అబ్బురం
పాలు పట్టాలి అంటూ
నా సర్వస్వాన్ని లాగేసుకుంటుంటే
ఆ పది నిమిషాలు శూన్యమైపోతాను
ఏ పనీ లేకుండా ఖాళీగా మిగిలిపోయి
అవును... యిప్పుడు నాకేం పనిలేదు!!

- రమణ వెలమకన్ని 9866015040