సాహితి

ఆంధ్రభూమి కథల పోటీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి దినపత్రిక పెట్టిన కథల పోటీకి ఎప్పటిలాగే ఈ ఏడూ మంచి స్పందన వచ్చింది. చెయి తిరిగిన సీనియర్లు, వర్ధమాన రచయితలు పోటాపోటీగా రచనలు పంపారు. రాశి బాగానే పెరిగినా కథల వాసి మొత్తంగా చూస్తే ఈసారీ ఒకింత నాసిగానే ఉన్నదని చెప్పక తప్పదు. ఇతివృత్తాల ఎంపికలో కాస్తంత వైవిధ్యం కానవచ్చింది. ముందొక సందేశాన్ని మనసులో నిర్థారించుకుని, దానిచుట్టూ ఇతివృత్తాన్ని, ఘటనలను అల్లడంలో కృత్రిమత్వం చోటుచేసుకుని, కథాశిల్పం దెబ్బతిన్న దృష్టాంతాలు చాలానే కనిపించాయి. అన్ని కోణాలనుంచి సాకల్యంగా పరిశీలించిన మీదట బహుమతులను ఇలా నిర్ణయించాము:

మొదటి బహుమతి
రూ.10,000
గీతాసారం
- సలీం

రెండో బహుమతి
రూ.5,000
కౌలు
- శరత్‌చంద్ర

మూడో బహుమతి (2)
రూ. 3,000
కామన్‌ఫండ్
- జొన్నలగడ్డ రామలక్ష్మి
సర్వర్ల రహస్యం
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు

ప్రత్యేక బహుమతి (2)
రూ. 2,000
ఇంతేనా ఈ జీవితం
- అత్తలూరి విజయలక్ష్మి
రెండో పెళ్లి
- బులుసు సరోజినీ దేవి

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదాలు. విజేతలకు అభినందనలు. బహుమతి పొందిన కథలను వచ్చే ఆదివారం (ఏప్రిల్ 10) నుంచీ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వరసగా ప్రచురిస్తాము. ప్రచురణకు ఎంపికైన కథల జాబితా సోమవారం సాహితి పేజీలో...
- ఎడిటర్