జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిస్టావర్ (జమ్ముకాశ్మీర్): కాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రయాణీకులు మరణించారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కేషావన్ ప్రాంతం నుంచి కిష్టావర్‌కు మినీ బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. స్టీరింగ్ అదుపుతప్పడంతో బస్సు పక్కనే ఉన్న 300 అడుగుల లోతు లోయలోకి దూసుకువెళ్లి పల్టీలుకొట్టింది. ఈ ఘటనలో 17 మంది మరణించారని, 16 మందికి గాయాలయ్యాయని జిల్లా అభివృద్ధి కమిషనర్ అంగ్రీజ్ సింగ్ రాణా చెప్పారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, డ్రైవర్‌కూడా ఉన్నారు. ఈ బస్సు డ్రైవర్ ఆష్రాఫ్ హుస్సేన్ మినీ బస్సును ఓవర్‌లోడ్‌గా తీసుకెళుతుంటే, ట్రాఫిక్ పోలీసులు జరిమానాను విధించారు. మృతుల్లో చాలా మంది మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జమ్ము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణీకులు ఉన్నా రు. గాయపడిన వారిలో ఐదుగురిని స్థానికాసుపత్రిలో చేర్పించారు. ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్న ల్ దేవందర్ ఆనంద్ మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్ వి5 చోపర్‌ను రంగంలోకి దించి సహాయ చర్యలుచేపట్టామన్నారు. గత నెల 21వ తేదీన రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం 13 మంది మరణించారు. క్యాబ్ లోయలోకి దూసుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకు ముందు జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.