శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రుణమాఫీపై దుష్ప్రచారం తగదు : ఆదాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూలై 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విడతలవారీగా రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీ జరగడం లేదంటూ దుష్ప్రచారం చేయడం తగదని ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు మండల పరిధిలోని ములుముడి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలుగదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో రైతుల రుణమాఫీ 60 కోట్ల రూపాయలుగా నిర్ధారించగా, అందులో 31 కోట్ల రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. ములుముడి గ్రామంలో రెండు విడతలుగా 50 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని మిగతా 50 లక్షలు మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని, అదేవిధంగా నియోజకవర్గంలో సుమారు పది కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, నీరు-చెట్టు కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పేద ముస్లింలకు ఉచితంగా రంజాన్ తోఫా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రైతు రుణమాఫీ పత్రాలు, రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ వసుమతి, హరిబాబు యాదవ్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రూ. 4లక్షల విలువైన
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
గూడూరుటౌన్, జూలై 2: నాలుగు లక్షల రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు పంగిలి గ్రామ సమీపాన రాజంపేట అటవీ ప్రాంతం రోడ్డు వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన పది ఎర్రచందనం దుంగలు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసులను చూసి పారిపోతున్న పంగిలి గ్రామానికి చెందిన సుబ్బయ్య, డి సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, నరసయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వెంకటగిరి సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాపూరు ఎస్సైలు రామకృష్ణ, కరిముల్లా, సిబ్బంది విజయభాస్కర్, రాజేష్, నాగార్జున దాడిలో పాల్గొన్నారన్నారు.
అక్రమంగా తరలుతున్న
ఇసుక పట్టివేత
సూళ్లూరుపేట, జూలై 2: మన్నారు పోలూరు సమీపంలోని కాళంగి నది నుండి అనుమతి లేకుండా అక్రమంగా టైర్లబండ్ల ద్వారా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శనివారం పట్టుకున్నారు. టైర్లబండ్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తహశీల్దారు రవీంద్రబాబుకు అక్కడివారు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన తన సిబ్బందితో కలసి దాడులుచేసి 15 టైర్లబండ్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నగరంలో పలు ప్రైవేట్ పాఠశాలలపై
విద్యాశాఖ అధికారుల దాడులు
వేదాయపాళెం, జూలై 2: జిల్లా విద్యాశాఖాధికారులు శనివారం నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలపై దాడులు నిర్వహించారు. డిప్యూటీ డిఇఓ షాఅహ్మద్ ఆధ్వర్యంలో ఎంఇఓ జగదీశ్వర్, సిబ్బందితో కలిసి కోటమిట్ట, జెండావీధి ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహించవద్దని చెప్పినా నిర్వహిస్తున్నారని అధికారులు పాఠశాలల యాజమాన్యాలపై మండిపడ్డారు. పాఠశాలలు నిర్వహించదలచిన వారు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఇకపై పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అక్రమంగా తరలుతున్న
తమిళనాడు బియ్యం పట్టివేత
వాకాడు, జూలై 2: తమిళనాడు రాష్ట్రానికి చెందిన 647 కిలోల బియ్యం నాయుడుపేట నుండి వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామానికి ఆటోద్వారా తరలిస్తుండగా పోలీసులు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజి వద్ద స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయిస్ అధికారులు పరీక్షించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ బియ్యంగా గుర్తించడంతో తహశీల్దార్ సమక్షంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకొని గోడౌన్‌కు తరలించినట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు. బియ్యం రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జల్లెడ పట్టినా కాకణిలో
చిన్నపాటి తప్పు చూపించలేరు
* వైకాపా నేతల సవాల్
వేదాయపాళెం, జూలై 2: ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి వ్యక్తిగత జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ జల్లెడ పట్టినా చిన్నపాటి తప్పును కూడా చూపించలేరని వైకాపా నేతలు సవాల్ చేశారు. వైకాపా జిల్లాపార్టీ కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటాచలం జడ్పీటీసీ వెంకటశేషయ్య మాట్లాడుతూ జిల్లాలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారన్నారు. ఆ విషయాన్ని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మరచినట్టున్నారన్నారు. 2011లో ఏసిబి దాడులు జరిగినప్పుడు కాకాణి విషయంలో చిన్నపాటి తప్పును కూడా చూపించలేకపోయారని, ఆ విషయాన్ని తెలుగుదేశంపార్టీ నాయకులు మరచిపోయారన్నారు. అప్పట్లో అఖిలపక్షం సమావేశం ఏర్పాటుచేసి అడిగిన ప్రశ్నలన్నింటికీ కాకాణి గోవర్దన్‌రెడ్డి బదులిచ్చారన్నారు. ఆ సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జడ్పీటీసీగా ఉన్నారని ఆ విషయాన్ని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు భాస్కర్‌గౌడ్, కోణం బ్రహ్మయ్య, పి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.