జాతీయ వార్తలు

ఉత్సాహమే ఊపిరిగా పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు అమెరికా రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునిచ్చారు. మిచిగన్ రాష్టల్రోని ఫార్మింగ్ టస్ హిల్స్ నగరంలోని సెయింట్‌తోమా చర్చిలో జరిగిన చినకాకాని ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల కార్యదర్శి, అమెరికాలో ప్రముఖ రేడియాలజిస్టు డా. ముక్కామల అప్పారావు ఆత్మకథ ‘ఉత్సాహమే ఊపిరిగా’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యార్లగడ్డ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విదేశాలలో స్థిరపడిర తెలుగువారు, వారి పిల్లలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ స్వదేశానికి కూడ తమ వంతు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు. డా. ముక్కామల యాభై ఏళ్ల క్రితం మూడు డాలర్లతో అమెరికా వచ్చి మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించి ఇక్కడ అమెరికాలోనూ, అక్కడ స్వదేశంలోనూ ఎంతోమందికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించారని యార్లగడ్డ కొనియాడారు.