జాతీయ వార్తలు

తిరుపతిలో ఐఐటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తిరుపతిలో ఐఐటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే విజయనగరం- టిట్లాగర్ మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ లైన్ నిర్మాణాన్ని 2,335.68 కోట్ల ఖర్చుతో చేపడతారు. ప్రధాని అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో దేశవ్యాప్తంగా ఆరు కొత్త ఐఐటిల ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, చత్తీస్‌గఢ్‌లోని భిలాయి, గోవా, జమ్ముకాశ్మీర్‌లోని జమ్ములో ఐఐటిలను ఏర్పాటు చేస్తారు. ధన్‌బాద్‌లోని ఐఎస్‌ఎంను ఐఐటిగా మార్చేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1961 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఈ ఐఐటిలను ఏర్పాటు చేస్తున్నారు.
విజయనగరం-టిట్లాగర్ మూడో రైల్వే లైన్‌ను రూ. 2,335.68 కోట్లతో చేపట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. 264.6 కిలోమీటర్ల పొడవైన మూడో లైన్ నిర్మాణాన్ని ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రస్తుత లైన్‌కు ప్రత్యామ్నాయంగా ఈ మూడో రైల్వే లైన్‌ను నిర్మిస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఖరగ్‌పూర్-ఝార్సుగూడా సెక్షన్, హౌరా- ముంబయి గ్రాండ్‌ట్రంక్ రూట్, హౌరా-చెన్నై ప్రధాన లైన్‌కు కూడా విజయనగరం-టిట్లాగర్ మూడో లైన్ ప్రత్యామ్నాయం అవుతుంది. విజయనగరం- టిట్లాగర్ రైల్వేలైన్ నిర్మాణంతో ఒడిషాలోని రాయగడ, కళహందీ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, బొబ్బిలి జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది.