జాతీయ వార్తలు

ఉభయ సభలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో వాయిదాల పర్వం నేడు కూడా కొనసాగింది. లోకసభ ప్రారంభం అవ్వగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు, కావేరీ జల వివాదంపై అన్నాడిఎంకే సభ్యులు, పిఎన్‌బి, విగ్రహాల ధ్వంసంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో సభను వాయిదా వేశారు. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ కొనసాగింది. పీఎన్‌బీ కుంభకోణంపై చర్చకు చైర్మన్ అంగీకరించినా.. సభ్యులు ఆందోళన విరమించలేదు. సభ్యులు గౌరవంగా వ్యవహరించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు నచ్చజెప్పినా ఫలితం లేకపోవటంతో సభను మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా వేశారు.