హైదరాబాద్

పాలిటెక్నిక్‌లో అప్రెంటిస్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 27: రామంతాపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అప్రెంటిస్ మేళాకు ఇంజనీరింగ్, డిప్లమా విద్యార్ధుల నుండి విశేష స్పందన లభించింది. డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, బోర్డు ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్ తారామణి చెన్నై ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన మేళాను తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి ప్రారంభించారు. ట్రైనింగ్ ఇచ్చి అవసరమైతే ఉద్యోగం ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కేంద్ర రంగ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అప్రెంటిస్ చేయడానికి ఇంజనీరింగ్, డిప్లమా కోర్సు చేసిన విద్యార్థినీ, విద్యార్థులు మూడువేల మంది హాజరయ్యారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇన్స్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్, మెటలార్జీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, కెమికల్, మైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రిజిస్ట్రేషన్, వెరికిఫేషన్‌తోపాటు వౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సాంకేతిక విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ నారాయణరెడ్డి, డిప్యూటి డైరెక్టర్ జయశేఖర్, ప్రిన్సిపాల్ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నైపుణ్యతను పెంచడానికి ఏర్పాటు చేసిన అప్రెంటీస్‌ను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, హాస్టల్స్‌లో వౌలిక వసతులను కల్పించనున్నట్లు ఎంవి రెడ్డి హామీ ఇచ్చారు.