హైదరాబాద్
ఇది జనత ఘనత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: కోవిడ్-19 వైరస్‌ను కట్డడి చేసేందుకు ప్రదాని నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణను పాటించారు. కొన్ని చోట్ల ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య పాలు, కూరగాయాలు, నిత్యావసర వస్తువుల విక్రయాలు అంతంతమాత్రంగా కొనసాగినా, ఆ తర్వాత జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా జనం, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా కన్పించే పలు మెయిన్ రోడ్లు జనం లేకపోవడంతో వెలవెలబోయాయి. ఆదివారం ఉదయం సికిందరాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ఇద్దరు కోవిడ్-19 వైరస్ క్యారంటైన్ బాధితులను పోలీసులు పట్టుకోవటంతో వైరస్ పట్ల అప్పటి వరకున్న భయం మరింత రెట్టింపయ్యింది. నగర ప్రథమ పౌరుడు మొదలుకుని వైద్యారోగ్య, పోలీసు, జీహెచ్‌ఎంసీలోని పలు విభాగాల మినహా నగరంలోని సుమారు కోటిన్నర మంది జనాభా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలు, మెయిన్‌రోడ్లు, సర్కారు ఆఫీసులు మొదలుకుని చిన్నాచితక వ్యాపార సంస్థలతో పాటు పాన్‌షాప్‌లు సైతం మూతపడటంతో నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు చిరువ్యాపారులు, బడా వ్యాపారులు సైతం కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. సాయంత్రం ఐదు గంటల నుంచి పలు ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి క్లాప్స్ కొడుతూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు, వైద్య సంబంధిత సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. కొన్ని చోట్ల ఉదయం పాలు, కూరగాయల కోసం జనం ఇక్కట్లు పడ్డారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని ప్రదాని నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు మేరకు చాలా ప్రాంతాల్లో జనం ఒక్కరోజుకు సరిపోయే సరుకులు మాత్రమే సమకూర్చుకున్నారు. నెలాఖరు కావటంతో ఆదివారం ఒక్కరోజు కర్ఫ్యూ పాటించిన తర్వాత మరుసటి రోజైన సోమవారం ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సమకూర్చుకునేందుకు ఏమైనా సమయం ఇస్తుందేమోనని జనం భావించారు. కానీ 31 వరకు ఇదే లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించటంతో జనం అపుడు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం వేట ప్రారంభించారు.