మెయిన్ ఫీచర్

భయాలను పోగొట్టే ప్రసన్నాంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన హిందూ దేశంలో ఆంజనేయుని దేవాలయం లేని గ్రామం లేదు. అంతేగాదు, ఇటీవల అభయ, భక్తాంజనేయ భారీ విగ్రహాలు జాతీయ మార్గములలో దర్శనమిస్తూ భక్తజనులకు, యాత్రికులకు ఓ విధమైన భద్రతాభావం కలుగుతుంది. ఒక్కక్షణం ఆ విగ్రహం ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని సాగిపోతూంటారు ఇంకను చెప్పాలంటే పంచముఖి ఆంజనేయ విగ్రహాలు మన రాష్ట్రంలోనేగాక తమిళనాడు, దక్షిణ ప్రాంతాలలోనూ మారుతి ఆరాధన జరుగుతూంది. అంతేకాదండోయి ‘జై భజరంగభళీ’ ఉత్తర హిందూ స్థానంలో పిల్లా పాపలతో పెద్దలు నుదుట సింధూర ధారణ చేసుకొని జైహనుమాన్ నామస్మరణతో హైందవ హృదయం పులకించగా నినదిస్తుంటారు. రుద్రాంశ సంభూతుడు మారుతి వాయు పుత్రుడు, అంజనాసుతుడు, శీఘ్ర ఫలప్రదాత, శక్తిని, బుద్ధిని, కీర్తిని, ధనము పాటు యశస్సు పాటు భూత ప్రేత పిశాచ, బ్రహ్మరాక్షస భేతాళ, శాఖిని, డాకినీ మొదలగు గాలి దయ్యములను తన వాలముతో చుట్టి నేలబడగొట్టి దుష్టగ్రహములను తొలగించడంలో ఆతనికి మించిన దైవశక్తి లేదంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ దండకమును రోజుకోమారు ఉదయం, సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో పఠిస్తే భయములన్నీ తొలగించి అండదండలుండి తన భక్తులను కాపాడుతాడట.
ఆంజనీసుతుడని వాయుదేవుని వరప్రసాదుడని, రుద్రాంశ సంభూతుడనియు, కేసరీ నందనుడనియు హనుమంతుడిని అనేక నామాలతో ప్రసిద్ధిగాంచిన భక్తజనపాలుడు. తన పుత్రునకు ఇంద్రుడు గాయము చేసినాడని తెలుసుకొన్న వాయుదేవునికి ఆగ్రహం కలిగి ఓ సారి తన అయనాన్ని స్తంభించినాడట. దాంతో సకల ప్రాణులు, దేవతలు తాహ్రి తాహ్రి అంటూ వాయుదేవుని శరణుజొచ్చినారట. బ్రహ్మ, విష్ణువు, శివుడు సైతం అభయమొసంగి ఆంజనేయునకు ఏ అస్తశ్రస్తమ్రులు కూడా హాని చేయవనియు వరం ఇచ్చారట. దానికిగాను ఈ హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉంటానని బ్రహ్మదేవునకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అందుకు వాయువు సంతసించి సకల జీవరాశులను చైతన్యవంతులుగా చేసి తన కర్తవ్య పాలుడైనాడు. ఇక హనుమంతుడు తన బాల్యావస్థలోనే సకల అధిదేవతలు అయిన సకల జ్ఞాన ప్రధాత అయిన సూర్యభగవానుని తన గురువుగా భావించి ఆతనిని ప్రార్థింపగా తన వేగమునకు తట్టుకునే శక్తి ఉదయాద్రి నుండి పశ్చిమాద్రివరకు అతివేగముగా పయనించే సూర్యుని తగిన వేగం తన శరీరాన్ని పెంచి ఉదయాత్రిపై ఒక పాదం, పశ్చిమాద్రిపై మరొక పాదముంచి సూర్యుని రథ దిశగా తన తలను త్రిప్పుచూ సర్వశాస్తమ్రులను, నాలుగు వేదములను, వ్యాకర్ణ చంద్ర శాస్తమ్రులను అభ్యసించినాడు.
ఋష్యమూక పర్వతమునందు సుగ్రీవుని కొలువులో సచివునిగా చేరి శ్రీరామ లక్ష్మణులతో స్నేహ బాంధవ్యము తన చతురమైన సంభాషణతో జరిపించి శ్రీరామ లక్ష్మణులను ఆకట్టుకున్నాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఘనుడు, నమ్మినబంటు. సుందరకాండలో సీతానే్వషణ ఘట్టం, లంకాదహనం గురించి వాల్మీకి ఎంతో రమ్యంగా రచించారు. సింధూరం ధరిస్తే రాముడు వశమవుతాడని తెలుసుకొని శ్రీరామచంద్రుడ్ని ప్రసన్నముగావించుటకై తన ఒడలంతా సింధూర ధారణం చేసుకొని జైశ్రీరాం అంటూ నిరంతరం నామజపం చేస్తూ ఆ శ్రీరామచంద్రుడిని ప్రసన్నం చేసుకొని శ్రీరామదాసునైతినని ఒప్పించాడు.
ఇక రామ రావణ యుద్ధంలో ఆంజనేయుని పాత్ర అమోఘమైనది. లక్ష్మణుని మూర్ఛనుండి కాపాడుటకై సంజీవనీ పర్వతమునే పెకలించి తెచ్చిన ప్రాణదాత. కార్యసిద్ధి కలగటానికి చిత్తశుద్ధితో నిత్యం కొలిచినవారికి అండదండలుండి జైభరంగభళీ జై హనుమాన్ అంటే చాలు ఎనలేని శక్తులు కలుగుతాయట. కలియుగాంతంవరకు హనుమంతుడు చిరంజీవుడై తనవారిని కాపాడి సర్వవేళలా ఆదుకుంటాడని సర్వదేవతలు వక్కాణించారు.

కొలనుపాక మురళీధరరావు