మెయిన్ ఫీచర్

యశస్సునిచ్చే యశోదానందుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని మీద మనకి ఉండే అచంచలమైన ప్రేమను భక్తి అంటారు. భగవంతుడి మీద ప్రేమతో ఆయనకు దగ్గరై బంధువుగానో, స్నేహితునిగానో, భక్తుడిగానో, తండ్రిగానో, ఏదో విధంగా ఆయనను మనం హృదయానికి దగ్గర చేసుకొనే మార్గానే్న భక్తియోగమంటారు.
జ్ఞానయోగానికి తెలివితేటలుండాలి. కర్మయోగానికి మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి. అష్టాంగ యోగం ఆచరించాలంటే ప్రాణాయామం, ఆసనాలు చెయ్యాలి. ఇవి అన్నీ చేసి వీటి ద్వారా భగవంతుని చేరాలంటే సరైన గురువు ఉండాలి. ఆయన ద్వారా యోగశాస్త్రం నేర్చుకొని తద్వారా భగవంతుని స్థితి అందుకోవాలంటే యోగమార్గము కూడా క్లిష్టమైనదే. ఈ మార్గాల్లో తేలికైనది భక్తిమార్గం. వీటిలో తొమ్మిది మార్గలున్నాయి. దీనినే నవ విధ భక్తి అంటాము.
భగవానుని చిన్న పాపాయిగా ఎత్తుకొని ముద్దాడింది యశోద. ఆ విధంగా కన్నతల్లి దేవకిని మించింది ఆమె. భక్తి భావాల్లో ఆమెది మాతృభావం.
గొల్ల పిల్లలందరూ శ్రీకృష్ణుని అవతార పురుషుడనుకోలేదు. అతడొక మహా వ్యక్తి అని, చరిత్ర సృష్టిస్తాడని అనుకోక కేవలం స్నేహితునిగానో, తోడుదొంగ గానో భావించారు. వెన్న దొంగగానో, ముద్దుల కృష్ణయ్యగానో భావించి అతనితో చద్ది అన్నాలు తిని ఆలుమందలు కాసి అతనితో ఆడుకొన్నారు. స్నేహంగా ప్రేమగా దగ్గరయ్యారు ఈ భావాన్ని సఖ్యాభావం అంటారు.
గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించి ప్రియునిగా ఆరాధించారు. మనస్సు, సర్వస్వం అర్పణ చేసారు. ముద్దులు మూట కట్టే శ్రీకృష్ణ ముఖారవిందాన్ని గ్రోలుతూ నిత్యం అతనే్న ధ్యానించారు. అతనిలో లీనమయిన వారిలో ముద్దులు కట్టే శ్రీకృష్ణుడు కాళ్ళు ఎక్కడ కందుతాయే ఏ ముల్లు గుచ్చుకుంటుందో అని బాధపడేవారు. వారిది ఆయన మీద ప్రేమతత్వం.
పై ప్రేమ తత్వంలో పరాకాష్టకు చెందినవారు రాధ, రుక్మిణి, సత్యభామ, భర్తగా, ప్రియునిగా వారి ప్రేమ అపరిమితం. వీరిది మధుర భక్తి.
ఇక కంసుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు దంతవకృడుగా గల అనేకులు శ్రీకృష్ణుని ద్వేషించినా నిరంతరం అతనినే వైరభక్తితో అతనినే స్మరించేవారు. వారు ద్వేషంతోనైనా స్మరించి తరువాత అతనిలో లీనమయ్యారు. వీరిది వైరభక్తి.
వీరుకాక పరాభక్త్భివంతో అక్రూరుడు, భీష్ముడు, విదురుడు, అర్జునుడు, మహర్షులు, మహాత్ములు. అతని చేరువయ్యారు. ఇక జాంబవంతుడు, కుచేలుడు మొదలైనవారు దాస్యభావంతో అతనికి చేరువయ్యారు. శ్రీకృష్ణుడు తనను ఏ భావంతో తన భక్తులు చేరువవుతారో వారిని అదే విధంగా కరుణిస్తానని భగవద్గీతలో చెప్పాడు కదా! ఆయన భక్తి సులభుడు. కాత్యాయినీ వ్రత మాచరించే యువతులు వ్రతం చేస్తున్నామనే సంగతి మరచి నగ్నంగా నదిలో దిగేసరికి వారి అహంపోగొట్టడానికి వారి వస్త్రాలు అపహరించి వారికి తనలో కేవలం భగవానుని దర్శించడానికే గోపికా వస్త్రాపహరణం చేసి అహం పోగొట్టాడు. పూర్వజన్మలో మహాఋషులైన వారికి అహంకారం లేకుండా చేయడమే భగవానుని ముఖ్యోద్దేశం.
ఇక శ్రీకృష్ణుని లీలలు అమోఘం. ఎనిమిది మంది పత్నులు కలిగి కంసుని, జరాసంధుని చెరల నుండి 16 వేల మంది రాజకన్యలను విడిపించాడు. వారందరును శ్రీకృష్ణుని చేపట్టినట్టుగా చెబుతారు. నారదునికి సందేహం కలిగి ప్రతి శ్రీకృష్ణుని భార్యల ఇంటిలో చూడగా శ్రీకృష్ణుడే దర్శనమివ్వడం, శ్రీకృష్ణుని నిజ నివాసంలో శ్రీకృష్ణుడు యోగ ధ్యానంలో మునిగి ఉండడం నారదుడు గమనిస్తాడు. ఇక బ్రహ్మాస్త్రం వలన పరీక్షిత్తు మృత శిశువుగా జన్మిస్తే అశరీరవాణి అస్కలిత బ్రహ్మచారి శిశువును తాకితే బ్రతుకుతాడని నుడువగా ఉత్తర సంబంధీకులంతా భీష్ముని ప్రార్థిస్తే అతడు నిజమైన అస్కలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడే అని సెలవిస్తాడు. అటుపై శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తే అతని స్పర్శ చేత పరీక్షిత్తు పునర్జీవుడవడం శ్రీకృష్ణుని బ్రహ్మచర్యానికి స్పష్టమైన హేతువుగా కనపడుతుంది. శ్రీకృష్ణుని యొక్క స్వరూపం, విశిష్టత బోధపడింది ఒక్క భీష్మునికే. పరిపూర్ణ అవతార పురుషుడు శ్రీకృష్ణుడే. అతడే భక్తి సులభుడు.

- పట్టిసపు శేషగిరిరావు