మెయిన్ ఫీచర్

మార్గానే్వషకులకు మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వమంగళకరమైన రామనామము ఎక్కడ జపించబడుతుందో అక్కడ చిరంజీవి ఆంజనేయుడు పద్మాసనారూఢుడై కొలువుతీరి ఉంటాడు. రామకథాగానం చేస్తున్న ప్రతిచోటా హనుమంతునికి ఒక ఉచితాసనం ఏర్పాటుచేయడం మన సంప్రదాయం. మాతృదేవి అంజన, పితృదేవులు కేసరిలకు వాయుదేవుని వరముచే ఉదయించిన కారణజన్ముడు చిరంజీవి హనుమ. బాల్యంలో సూర్యబింబాన్ని ఫలముగా భావించి ఆరగించడానికి సూర్యమండలములోకి లంఘించిన బాలాంజనేయుని గ్రహణావస్థలోనున్న రాహువు అడ్డుపడగా అతనిని నిరోధించి ముందుకు సాగాడు. ఇది చూసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని హనువులపై మోదగా అవి పొంగి హనుమంతుడైనాడు. ఇంద్రుడు చేసిన పనికి వాయుదేవుడు ఆగ్రహించి తన ధర్మాన్ని నిలువరించగా సృష్టికి విఘాతం కలిగింది. అంత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు అష్టదిక్పాలకులు హుటాహుటిన ఏతెంచి హనుమంతునికి అనేక వరాలను ఇచ్చి వాయుదేవుని ఆగ్రహాన్ని చల్లార్చారు. సప్త సముద్ర లంఘనాశక్తిని శివుడు, నీటినుంచి హానిలేని వరాన్ని వరుణుడు, అగ్నిచే హానిలేని వరాన్ని అగ్ని, మృత్యుజయాన్ని యముడు, నిత్య సంతోషాన్ని కుబేరుడు, సకల వాస్తు నిర్మాణ జ్ఞానాన్ని విశ్వకర్మ, కామజయాన్ని కామదేవుడు, అష్టసిద్ధులను సూర్యుడు ఏకకాలంలో ప్రదానం చేశారు.
ఫలాపేక్ష రహిత భక్తితత్పరుడు అంజనీసుతుడు. కార్యసాధకులకు మార్గదర్శి. ప్రభు భక్తి పరాయణుడు కేసరి నందనుడు. త్యాగానికి మారుపేరు హనుమ. అతులిత బలధాముడు. మనసుకంటే వేగవంతమైన మనోజవుడు. వాయు సమాన చలన శక్తిగల మారుత తుల్యవేగుడు. ఇంద్రియములను జయించిన జితేంద్రియుడు. క్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించగల బుద్ధిమతాం వరిష్టుడు. వాయుదేవుని వరపుత్రుడు కావున వాతాత్మజుడు. శతయోజన సంద్రమును అవలీలగా లంఘించిన వానరయూధ ముఖ్యుడు. ఆత్మస్వరూపమైన సీతామాతను కనుగొన్న శ్రీరామదూత. బంగారు వర్ణముగల దేహము కావున హేమశైలాభదేహుడు. రావణునికి హితబోధ చేసిన మహాజ్ఞాని. సర్వమంగళ గుణములతో సకల గుణ నిధానుడు. సీతానే్వషణలో అందరికీ సందేహములను తీర్చిన సంకట మోచనుడు. ప్రియభాషణతో అందరినీ మెప్పించిన నవవ్యాకరణ పండితుడు. ఋగ్వేదములో వృషకపి. రామాయణంలో మహాకపి. ద్వాపర యుగంలో కపిభ్రాత మరియు విజయకేతుడు. కలియుగంలో అభయాంజనేయునిగా హిమాలయములలో కొలువైన చిరంజీవి మన హనుమ. తలచినంతనే భయమును పటాపంచలు చేసి ఎనలేని ధైర్యమును ప్రసాదించు మహిమాన్వితుడు.
కార్యసిద్ధి కలగాలంటే హనుమను తలచి ముందుకు సాగాలి. హనుమ సిద్ధి కలిగాలంటే శ్రీరామనామముతో ప్రారంభించాలి. అవతార పురుషులైన శ్రీరామ హనుమల మొదటి పరిచయం కిష్కింధకాండలో జరిగింది. అత్యంత సౌజన్య లక్షణాలను చూసి తమ వృత్తాంతాన్ని వివరించమని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు రాముడు. పరమాత్మ దీనావస్థను విన్న హనుమ తన పాత్రకు ముహూర్తం సమీపిస్తున్నదనే వింత భావనతో సానుభూతి చూపక అంతే కష్టాలలోనున్న సుగ్రీవుని గురించి వివరించి ఇరువురి కలయిక సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపిన బుద్ధిమంతుడు హనుమ. సీత జాడ తెలియక తిరిగి కిష్కింధకు శుష్క సమాచారముతో వెడితే తీవ్ర దండన తప్పదని భయపడిన అంగదుడు ఋక్షబిల సమీపంలో ఉండిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ విపత్కర సమయంలో అంగదునిలోనున్న అష్ట సద్గుణాలను, పదునాలుగు అద్భుత లక్షణాలను గుర్తుచేసి కార్యోన్ముఖుని చేసిన ధీశాలి హనుమ.
జటాయువు అన్న సంపాతి ద్వారా రావణుని జాడ తెలుసుకొన్న అంగద సమూహము జాంబవంతుని సలహాతో ఆంజనేయుని లంకకు పంపాలని నిర్ణయించుకున్నాయి. కాని ఆ నిర్ణయం శ్రీరామచంద్రుడు తన అంగుళీయకాన్ని హనుమకు ఇచ్చినపుడే జరిగిపోయింది. మహాలంఘనముతో వీరాంజనేయుడు లంకకు చేరి లంకిణిని చంపి రావణ సంహారానికి నాంది పలికాడు. సుందరకాండలో తన చతురత, మహిమ, విశ్వరూపమును చూపించి, లంకను కాల్చి, సీతమ్మ చూడామణితో శ్రీరాముని చేరి ఆత్మాలింగనానికి పాత్రుడయినాడు. రామసేతు నిర్మాణంతో యుద్ధకాండకు శంఖారావం పూరించి సకల రాక్షస సంహారం చేయించిన వానర ముఖ్యుడు హనుమ.
సీతారామలక్ష్మణులతో పుష్ప విమానంలో అయోధ్యను చేరి శ్రీరామ పట్ట్భాషేకముగావించి రాముని పాదాల వద్ద దాసాంజనేయుడయ్యాడు హనుమ. హనుమ దాసులమై మనం తరిద్దాం.

-వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు