మెయిన్ ఫీచర్

విష్ణుమూర్తికి ప్రతిరూపం.. ఏడుకొండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశిష్టాద్వైతమును ప్రతిపాదించినవారు శ్రీ రామానుజాచార్యులు. దీనిలో జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు. ఈ మూడు సత్యములే అని ఈశ్వరుడు లేనిది ప్రకృతి జీవుడు ఉండజాలవు. శరీరంలో జీవుడు ఉన్నట్లే ఈశ్వరుడున్నాడని అతనిని భక్తిప్రపత్తులతో అనుష్టించిన మోక్షము పొందెదరని సిద్ధాంతపరంగా తెలియచేసారు.
‘‘శ్రీమద్రామానుజాచార్యులు క్రీ.శ. 939 సం.లో ఇప్పటి పెరంబూర్ కేశవ సోమయాజి అనే ఆస్తికునికి కుమారునిగా జన్మించారు. ఈయన ఆదిశేషుని, అవతారమని ప్రతీతి. ‘‘సంస్కృత, ద్రవిడ వేదములు క్షుణ్ణంగా కూలంకుషముగా పఠించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి సామాన్యులకు సైతం తత్త్వజ్ఞానం, అర్థమయ్యేలా సులభశైలిలో స్పష్టంగా తెలియచేస్తూ గొప్ప వైష్ణవ తత్త్వవేత్తగా ప్రసిద్ధిచెందారు. ‘‘వేంకటాచలంలో అర్చామూర్తిగా వెలసిన శ్రీనివాసుని గూర్చి శైవులు అనేకానేక ప్రచారాలు చేసారు. త్రిపురాసుర సంహారం తర్వాత కుమారస్వామి బ్రహ్మహత్యాపాతకాన్ని వేంకటాచలానికి వచ్చి కుమారధారలో స్నానంచేసి పాతకం పోగొట్టుకోవడం జరిగింది.
‘‘ఆ కుమారస్వామి విగ్రహమే అని కొందరు, శివునిదని కొందరు ఇలా వాదోపవాదాలు జరిగేవి. తిరుమల వృత్తాంతమంతా శ్రీరంగక్షేత్రంలో ఉన్న శ్రీరామానుజాచార్యులు వారికి కొందరు చెప్పి పరిస్థితులను చక్కదిద్దవలసినదిగా ప్రార్థించారుట.
‘‘వెంటనే శ్రీరామానుజులు శ్రీ (పదపురి) తిరుపతికి వచ్చి యాదవరాజు సభకు వెళ్ళి తన స్వపరిచయం చేసుకొని తన శాస్త్ర పాండిత్యం ‘నిరూపించి శైవులను సభకు పిలిపించి వారికి, తనకు వాద్వివాదానికి అవకాశం కల్పించి ఇద్దరి వాదనలు విన్న తర్వాత రాజును నిష్పక్షపాతంగా నిర్ణయం చేయవలసిందిగా సూచించారు శ్రీరామానుజులవారు.
‘‘వృషభాచలం, అంజనాచలం, శేషాచలం, వేంకటాచలం అలా అని వివిధ పేర్లుతో పిలవబడే కొండపైన ఆలయంలోని మూర్తి విష్ణువా, కుమారస్వామా, శివుడా? శక్తియా, కాలభైరవునిదా ఎవరు అనే నిర్ణయం చర్చకు యాదవరాజు సమక్షంలో విద్వత్ గోష్టి ప్రారంభమైంది. ‘‘యాదవరాజు శైవ, వైష్ణవ పండితులకు- ఆహ్వానించి పంపి సభలో ఇరువర్గాల వారికి సమాన అవకాశము కల్పించి వారి వారి వాదనలు ప్రమాణాలతో సభకు నివేదించమని ఆదేశించడం జరిగింది. ‘‘కొండమీదనున్న భూవరాహస్వామి, శ్రీనివాసులు ఇరువురు శ్రీమన్నారాయణులే! యని శ్రీనివాసుడు ఈ పర్వతానికి ఎలా వచ్చారో పురాణాల్లో కూడా విపులంగా ఉంది. భవిష్యోత్తర పురాణంలో ఉంది. కొండమీదనున్న భూవరాహస్వామి, శ్రీనివాసుడు ఇద్దరూ శ్రీమన్నారాయణులే అని తెలుస్తోందని చెప్పారు. ‘‘రెండుపక్షములవారు దేవతల అసాధారణ చిహ్నాలను, ఆయుధాలను బంగారంతో తయారుచేయించి అందరూ వేంకటాచలానికి వెళ్ళి నిర్ణయించిన దినాన గర్భాలయంలో ఉంది. ఆలయద్వారాలు బంధించారు. రాజముద్రలు వేయించి ఆలయంచుట్టూ ప్రదక్షిణలుచేస్తూ ఎవరు లోపలకు వెళ్ళకుండా జాగ్రత్త గడిపారట. ‘‘వారివారి దేవతలు వారి వాదమే గెలిచి వారి ఆయుధాలే అర్చామూర్తి ధరించాలని ప్రార్థిస్తూ అంతా గడిపారట. శ్రీరామానుజులు, శ్రీనివాసుని తన యోగమహిమతో సమీపించి స్వామిని సాక్షాత్కారము చేసుకున్నారు. స్వామీ నీవు ఇదివరకు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ‘‘నీ దివ్యాయుధాలైన శంఖ, చక్రములను ధరించి మమ్ములను కాపాడి ఇతరులకు జ్ఞానోదయం కల్గేటట్లుచేసి నీవు ఎవరివో అందరికి స్పష్టంగా తెలిసేటట్లు అనుగ్రహించమని కోరాడట.
‘‘యాదవరాజు శ్రీరామానుజుల సలహాతో శ్రీనివాస భగవానుని మహాసంప్రోక్షణ చేసి, ఈ దేవుడు శ్రీమహావిష్ణువే అని నిశ్చింత అభిప్రాయాన్ని దేశమంతటా ప్రయాణం చేయించారు.
‘‘శ్రీరామానుజులు భవిష్యత్ పురాణంలో స్వామివారి ఆదేశాల ప్రకారం, ఈ ఆలయంలో వైఖానస, ఆగమ సాంప్రదాయం ప్రకారం పూజలు జరగవలెనన్న నియమాన్ని నిశ్చయంగా జరిగేటట్లు కట్టడిచేసి నిత్యారాధన వ్యవస్థను ఏర్పాటుచేసారు. ‘‘్భగవదనుగ్రహం సంపూర్ణంగా కూడిన శ్రీరామానుజులు తిరుమల దేవాలయంలో చాలా సంస్కరణలు చేసారు. శిథిలమవుతున్న ఆనంద నిలయ విమానాన్ని జీర్ణోద్ధరణ చేయించారు. పురాణాల్లో శ్రీనివాసుడు వైఖానస మునికి ఇచ్చిన ఆజ్ఞప్రకారం భగవత్ యిచ్చగా భావించి తిరుమల ఆలయంలో వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి పూజాపద్ధతి నిత్యారాధన సంస్కరణలు చేసారు! శ్రీపఠ్వతమే స్వామి యని భావించి రామానుజుల వారు మోకాళ్లతో కొండను ఎక్కి స్వామిని దర్శించుకున్నారట. మరికొందరు పాదాలతో శ్రీపర్వతాన్ని తాకరాదని కొండ దిగువనే స్వామిగూర్చి తపస్సు చేస్తూ స్వామి దివ్యదర్శనభాగ్యాన్ని పొందేవారట.

- జి.కృష్ణకుమారి