మెయిన్ ఫీచర్

అమ్మపేరుతో పట్టణాలు.. అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో విశాల, కల్యాణి, అయోధ్య, ధారా, మధుర, భోగవతి, అవంతి, విజయ అనే ప్రసిద్ధ నగరాలు ఉన్నాయి. పదహారేళ్ల ప్రాయానికే ఆనాటికి ప్రచారంలో ఉన్న సంస్కృత వాఙ్మయాన్ని అంతటినీ ఆపోశనపట్టి ఆపై సన్యసించి, అచిరకాలంలోనే తనకంటె వయోధికులైన శిష్యులను సంపాదించి, యావత్ భారతదేశ పర్యటనగావించిన శంకరాచార్య ఆ పర్యటనల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతి క్షేత్రంలోనూ ఆయా క్షేత్రాధి దేవతలను గురించి ఒక్కొక్క స్తోత్రాన్ని ఆశువుగా అక్కడికక్కడే చెబుతూ తన ఊహాశక్తినీ, కల్పననూ బహుముఖంగా ప్రవేశింపజేశాడు.
శ్రీ శంకరాచార్య తన సౌందర్య లహరిలో పార్వతీదేవిని త్రిమూర్తులలో శక్తినిచ్చే పరదేవతగా ప్రకటించి ఆరాధించాడు. ఎంతటి కవులకైనా సత్పురుషులకు ఆనందాన్నిచ్చే కవితాశక్తి అలవడాలంటే పార్వతీదేవి యొక్క అనుగ్రహం కావలసిందేనని ఆయన స్పష్టంచేశారు. పార్వతీదేవి అనుగ్రహం ఉంటే సరస్వతీదేవి అనుగ్రహమూ, లక్ష్మీదేవి అనుగ్రహమూ వాటియంతట అవే సిద్ధిస్తాయని శ్రీ శంకరాచార్య తన ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించారు.
పార్వతీదేవి అమ్మవారి కరుణామయ దృష్టి అనేక ఉత్కృష్టగుణాలతో విశాల, కల్యాణి, అయోధ్య, ధారా, మధుర, భోగవతి, అవంతి, విజయ అయి ఉన్నదని శ్రీ శంకరాచార్య వర్ణించారు. ఈ కరుణ దృష్టి లక్షణమే భారతదేశంలోని నగరాల పేర్లుగా వెలుగునకు వచ్చాయని వెల్లడిస్తూ ఆయన ఈ క్రింది శ్లోకం వెల్లడిస్తూ పార్వతీ మాతను స్తుతించారు.
విశాలా, కల్యాణీ, స్ఫుటరుచిః అయోధ్యా కువలయై
కృపాధారా ధారా కిమపి మధురా, భోగవతికా
అవంతీ దృష్టిఃతే బహునగర విస్తార విజయా
ధ్వంతత్ తత నామ వ్యవహరణ యోగ్యా విజయతే- అని ఈ పద్యంలోని నగరాల పేర్లకు, పార్వతీదేవి కరుణాదృష్టికీ సారూప్యత మనం ఇక్కడ గమనిద్దాం.
1) విశాల:- దేవి దృష్టి విశాలమైనది
2) కల్యాణి:- దేవి దృష్టి కల్యాణకరమైనది
3) అయోధ్యా:- దేవి దృష్టి అయోధ్య అనగా జయంచశక్యం కానిది
4) ధారా:- దేవి దృష్టి కృపారసధార వంటిది
5) మధురా::- దేవి దృష్టి ఎంతో మధురమైనది
6) భోగవతి:- దేవి దృష్టి సర్వభోగములకు నిలయమైనది
7) అవంతి:-దేవి దృష్టి లోకమంతటిని కాపాడునది.
8) విజయ:- దేవి దృష్టి విరోధులందరినీ జయించునది
ఇలా పార్వతీదేవి దృష్టి ఆయా నగరాల పేర్లతో సారూప్యత పొందియున్నట్లు వర్ణించడం శ్రీ శంకరాచార్యుని అద్భుత కవితాశక్తికి నిదర్శనంగా మనం భావించవచ్చును కదా.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి