మెయిన్ ఫీచర్

కార్తిక ఫున్నమి వెలుగులు జ్ఞానజ్యోతి మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయగ్‌ం శివః’’ అంటూ శివకేశవులు పూజలందుకునే కార్తికంలో కాశీలో గంగమ్మకు ఇచ్చే దీపహారతిని వర్ణించడానికి వేయనోర్లున్నా చాలవంటారు ఈ కార్తికపున్నమిరోజు. దేవతలంతా గంగమ్మ దర్శనంకోసం దివి నుంచిభువికి దిగివస్తారంటారు. కాశీని స్మరిస్తూ మహిళలందరూ ప్రతి జలాశయంలోనూ అరటి దొనె్నల్లో దీప ప్రకాశనం చేస్తారు. దీపదానం వస్తద్రానం, అన్నదానం కార్తికంలో విశేషఫలప్రదాలు. దేవతలను, మానవులను హింసించే త్రిపురుడిని గరళకంఠుడు మట్టుపెట్టిన కార్తికపున్నమిని త్రిపురపూర్ణిమగా సంభావిస్తారు. క్షీరసాగరమథన సమయంలో హాలాహాలాన్ని కంఠాన పట్టి లోకాన్ని రక్షించిన పరమేశ్వరుని కీర్తిస్తూ పార్వతీదేవి జ్వాలాతోరణ ఉత్సవం జరిపించిదని శివాలయాల్లో జ్వాలాతోరణ ఉత్సవాలు జరుపుతారు. దంపతులు ఈరోజున సరిగంగస్నానాలు చేస్తారు. మత్స్యావతారునిపూజను, దత్తాత్రేయ జన్మదినాని కూడా ఈ రోజున చేస్తుంటారు. కృత్తికలపాల తాగిన కుమారస్వామిని స్మరించి కృత్తికా దీపతోరణాలు అలంకరిస్తారు. కోడెదూడను నేటిదినాన పితృదేవతాప్రీత్యర్థం వదులుతారు. పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో నదులలో అరటిదొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. వెండి, బంగారం, సాలగ్రామం, భూ, గోదానాలతో పాటు అన్నదానం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలం దొరుకుతుందంటారు.
నేను అంటే ఎవరో తెలుసుకో అపుడు భగవంతుని తత్త్వం అవగాహనకు వస్తుందని వౌనంలోనే వక్కాణించే రమణాశ్రమం ఉన్న తిరువణ్ణామలై లోని అరుణాచలస్వామి దేవాలయంలో కార్తిక దీపోత్సవాలను విశేషంగా చేస్తారు. నేడు బుద్ధుడు తన తల్లి చెంత ఉంటాడని బౌద్ధులు విశ్వసిస్తారు. వీరుకార్తిక పున్నమిని మూడు రోజులు చేస్తారు టపాసులు, మతాబులు కాల్చి వారు పండుగను ఘనంగా జరుపుకుంటారు. భక్తేశ్వర వ్రతఫలం పొందిన కుముద్వతిని తలచుకుని తమకూ అపమృత్యుదోషం పోగొట్టమని పరమేశ్వరపూజలు చేస్తారు. కృతయుగంలో రత్నమయలింగం- త్రేతాయుగంలో సువర్ణలింగం- ద్వాపరయుగంలో రసలింగం- కలియుగంలో పార్థివలింగం ఉత్కృష్టమైనవని లింగపూజను విశేషంగా చేస్తారు. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలాలని నిండుచంద్రుడు ఆకాశాన నిలిచిన పూర్ణిమనాడు దీపతోరణాలను వెలిగించడం కార్తికపూర్ణిమ ప్రత్యేకత. పంచాక్షరీలో ‘న’ అక్షరం బ్రహ్మను భూమిని, ‘మ’ అక్షరం విష్ణువును జలాన్ని, ‘శి’ అక్షరం రుద్రుణ్ణి, అగ్నిని, ‘వా’ అను అక్షరం మహేశ్వరుణ్ణి వాయువుని, ‘య’ అక్షరం సదాశివుణ్ణీ, ఆకాశాన్ని సూచిస్తాయి. పరమశివుడు పంచకృత్య పారాయణుడు అని వాయు పురాణంలో చెప్పబడింది. పంచ కృత్యాలంటే సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం అనేవి.
ఈ పరమేశ్వరుని ‘మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’- ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారు ముక్తిప్రదులని వేదంచెబుతోంది. అట్లాంటి వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం మహత్తరమైంది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అత్యంత మహిమాన్వితమైంది. ఆ పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాల మహిమ ఇంతింత అని చెప్పరాని మాహాత్మ్యంకలవి. అందుకనే ‘శివ’ నామోచ్చారణ చేయమని పెద్దలు చెబుతారు. ఈ శివ అన్న పదంయొక్క మహిమను పద్మపురాణంలో పాతాళ ఖండంచెబుతుంది. ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజవలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానమువల్ల ముక్తి కలుగుతుంది. మంగళ ప్రదము, అకారమకార ఉకారసమ్మేళమైన ఓంకారాన్ని ముండకోపనిషత్తుకూడా ధ్యానించమని చెప్తోంది. కనుకనే
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానందభాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశానమీడే
అని కార్తికంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు కొలుస్తుంటారు.

- సత్య