జాతీయ వార్తలు

అస్సాంలో కర్ఫ్యూ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవాహటి: పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాంలో ఆందోళనలు బయలుదేరటంతో పాటు ఇవి హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించారు. కాగా శనివారంనాడు కర్ఫ్యూను ఎత్తివేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు రావటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. రాష్ట్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను సైతం నిలిపివేయటం జరిగింది.