హైదరాబాద్

బ్రిటిష్ పార్లమెంటులో రామానుజాచార్యుల శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: జగద్గురువు రామానుజాచార్యుల జీవిత చరిత్రను ఇల్లందుల రామానుజాచార్య మూడువందల సం.ల క్రితం తాళపత్రాలపై రాసి బ్రిటిష్ లైబ్రరీలో పొందుపరిచి వుంచారని, వాటిని యధావిధిగా పుస్తక రూపంలో తెచ్చానని ప్రముఖ నృత్య కళాకారిణి వింజమూరి రాగసుధ తెలిపారు. రవీంద్రభారతిలో ఆమె మాట్లాడుతూ, ప్రతి పద్యం ‘నమో నమో యతిరాజా..’ అంటూ పూర్తవుతుందని, ఇందులో మొత్తం వంద పద్యాలుంటాయని తెలిపారు. రామానుజాచార్యులు 999వ జయంతి సందర్భంగా మే 10న బ్రిటిష్ పార్లమెంటులో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వచ్చే సం. జగద్గురువు రామానుజాచార్యుల స్వామి సహస్ర జయంతిని ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. తనను తాను పరిచయం చేసుకుంటూ ఏడేళ్ల వయసులో హైదరాబాద్‌లో నాట్యాచార్యులు ఉమా రామారావు శిష్యరికంలో నృత్యం ప్రారంభించానని, నగరంలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చానని అన్నారు. హైదరాబాద్‌లో కళాశాల విద్య పూర్తిచేసి పనె్నండేళ్ల క్రితం లండన్‌లో స్థిరపడ్డానని చెప్పింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా బ్రిటిష్ పార్లమెంటులో తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావస్తున్నానని అన్నారు. లండన్‌లో తెలుగువారికోసం ‘సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్’ సంస్థను స్థాపించి తన వంతు సాంస్కృతిక కళాసేవను అందరికీ అందిస్తున్నానని రాగసుధ తెలిపారు. తొలుత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ- రాగసుధను పరిచయం చేసి ఆమె సాధించిన ప్రగతి వివరించారు.
కాచిగూడ, ఫిబ్రవరి 12: ప్రముఖ రచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ రచయిత శీలావీర్రాజు, సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీలకు పోలాప్రగఢ సత్యనారాయణ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ శాస్ర్తీయ గ్రంథాలను కూడా అంగ్లంలోనూ తెలుగులోనూ రచించారని తెలిపారు. వివిధ భాషల్లో అనేక గ్రంథాలను రచించారని కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త డా.పోతుకూచి సాంబశివరావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో రచయిత్రి డా.వాసా ప్రభావతి, రచయిత సుధామ, ప్రపంచ రికార్డుల గ్రహీత డా.కళావేంకట దీక్షితులు, వంశీ సంస్థల అధ్యక్షుడు వంశీరామరాజు, డా.తెనే్నటి సుధాదేవి, తరుణి సాహితీ సమితి అధ్యక్షురాలు పోలాప్రగడ రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.