వరంగల్

మార్చి 30లోపు మిషన్ భగీరథ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిప్యూటీ సిఎం కడియం ఆదేశం * బచ్చన్నపేట, చేర్యాల మండలాల్లో పనుల పరిశీలన
బచ్చన్నపేట, డిసెంబర్ 18: మండలంలోని విఎస్‌ఆర్‌నగర్ వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మార్చి 30లోపు పూర్తి చేయాలని ఆర్‌డబ్యూఎస్ అధికారులను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఆదేశించారు. శుక్రవారం కడియం కార్యక్రమంలో భాగంగా కట్కూరు శివారు గ్రామమైన విఎస్‌నగర్ వద్ద మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ పనులు మార్చి 30 లోపు పూర్తిచేసి పరిసర గ్రామాలకు తాగునీరు అందేవిధంగా చూడాలని అదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పరిసర గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడానికి అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. రూ. 40 లక్షల వ్యవయంతో విఎస్‌ఆర్‌నగర్ వద్ద 90లక్షల లీటర్ల నీరు నిల్వ సామర్థ్యం గల ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ ట్యాంకు నిర్మాణపు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ట్యాంక్‌కు కొండపాక, తపాసుపల్లి రిజర్వాయర్ల మీదుగా కొమురవెల్లి, ముస్త్యాల కేంద్రాల నుంచి మూడు దశలుగా నీరు ఇక్కడి చేరుకుంటాయని చెప్పారు. ఇక్కడి నుంచి మండలంలోని కట్కూరు, ఆలింపూర్, బండనాగారం, బచ్చన్నపేట, కొడవటూరు, నాగిరెడ్డిపల్లి, పడమిటి కేశ్వాపూర్, కేశిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి తదితర గ్రామాలకు తాగు సరఫరా చేస్తారు. నీరు నేరుగా ఆయా గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకుల నింపి ఇంటి నల్లాల ద్వారా అందజేస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దల పద్మ, జిల్లా కలెక్టర్ వాకటి కరుణ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, అధికారులు ఏసుపాదం, శ్రీనువాసు, ఎమ్మార్వో విజయ్‌భాస్కర్, పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
చేర్యాల: కొమురవెల్లి కేంద్రంగా జనగామ, గజ్వేల్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు పనులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. అనంతరం ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంతంలో చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమ పనుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికే కాకుండా ఇక్కడి నుండి వేరే పట్టణాలకు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు వెళ్లే పైపులైన్ ద్వారా ఈ ప్రాంతాలకు తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. ఇందులో కొమురవెల్లి కూడా ఉండటం హర్షనీయమన్నారు.