హైదరాబాద్

శాస్ర్తియంగా బిసి ఓటర్ల గణన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: మహానగరంలోని ఎన్నికల మున్సిపల్ డివిజన్ల రిజర్వేషన్ల కోసం చేపట్టిన బిసి ఓటర్ల గణన ప్రక్రియ, శాస్ర్తియంగా, పారదర్శకంగా చేపట్టినట్లు మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది, గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 7వేల 51 పోలింగ్ బూత్‌ల స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరు కులాన్ని తెల్సుకుని, బిసి ఓటర్ల వివరాలను జాబితాలో నమోదు చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో ప్రక్రియ పారదర్శకంగా సాగిందని ఆయన వివరించారు. ఇందుకు గాను ప్రతి బిసి ఓటరు సంతకం, సెల్‌ఫోన్ నెంబర్‌ను సేకరించినట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల నుంచి మరో నాలుగైదు రోజుల్లో సమాచారం పూర్తి స్థాయిలో వస్తుందని, ఈ వివరాలను భద్రపరిచి, బిసి ఓటర్ల ముసాయిదాను జారీ చేసినానంతరం అభ్యంతరాలు, సూచనలు, సలహాలు సేకరించే సమయంలో రాజకీయపార్టీలు, సంస్థలు, వ్యక్తులకు ఈ సమాచారాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. బిసి ఓటర్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా చేపట్టిన బిసి ఓటర్ల గణనలో ఎవరైనా తప్పిపోయి ఉంటే వారు కులధృవీకరణ పత్రాన్ని చూపి, తిరిగి తమ సమాచారాన్ని జాబితాలోకి ఎక్కించుకోవచ్చునని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఓటరు జాబితా సవరణతో ఎపుడూ ఎవరికెలాంటి ఇబ్బందులుండవని, ఎవరి ఓట్లయినా తొలగించినట్టు ఉంటే, వారు వెంటనే తగిన సమాచారం, డాక్యుమెంట్లు చూపి తమ స్థానిక ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ధ తిరిగి పేరు చేర్చుకోవచ్చునని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఓట్లను తొలగించారంటూ ఎవరూ అపోహ, ఆందోళనకు గురయ్యే అవసరం లేదని, రాష్ట్ర ఎన్నికల సంఘం జిహెచ్‌ఎంసి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే వరకు కూడా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
=================
కన్నుల పండువగా కోటిదీపోత్సవం
నల్లకుంట, నవంబర్ 20: జయజయ శంకర, హరహర మహాదేవ్, శంభోశంకర అనే శివనామ స్మరణల మధ్య ఎన్టీఆర్ స్టేడియ మార్మొగింది. భక్తి టివి ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ స్టేడియంలో కోటిదీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ ప్రవచం చేస్తూ కార్తీకమాసం విశిష్టతను తెలిపారు. అన్ని దీక్షలకు కార్తీకమాసం అనువైనదని చెప్పారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి మాట్లాడుతూ కోటిదీపోత్సవ కార్యక్రమం ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు కృషి చేస్తుందని కొనియాడారు. కలషంతోపాటు అగ్నిలో భగవంతుడిని ఆరాధించే గొప్ప సంసృతి హిందూ మతానిదని తెలిపారు. ముంబాయి మహామండలేశ్వర్ శ్రీవిశే్వశానందగిరి స్వామి తనగనుగ్రహ సంభాషణంలో వైదిక సనాతన ధర్మం స్వంత హితం కాక జగత్ హితాన్ని కోరిందని కోటిదీపోత్సవ కార్యక్రమం విశ్వవ్యాప్తం కావలన్నారు.