హైదరాబాద్

బిసి ఓటర్ల సర్వే తప్పుల తడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నవంబర్ 27: గ్రేటర్‌లో బిసి ఓటర్ల సర్వే తప్పుల తడకగా కొనసాగిందని అన్ని పార్టీల నేతలు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం ఓటర్లను తొలగించడంతోపాటు డివిజన్‌ల విభజనను శాస్ర్తియంగా చేపట్టకుండా గందరగోళాన్ని సృష్టించారని ఆరోపించారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బిసిలను కేవలం 25శాతం చూపుతూ జిహెచ్‌ఎంసి అధికారులు తప్పులతడకగా నివేదిక తయారు చేశారని వివిధ రాజకీయపార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నార్త్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. శుక్రవారం మున్సిపల్ జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటీ కమీషనర్ విజయరాజు.. సర్కిల్ పరిధిలోని అన్ని పార్టీల నేతలను ఆహ్వానించి బిసి ఓటర్ల జాబితాసర్వే వివరాలను వివరించారు. సకలజనుల సర్వే సమయంలో లక్షకుపైగా ఉన్న బిసి ఓటర్లు ఒక్కసారిగా సగానికిపైగా ఎలా తగ్గిపోయారో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిన అధికారులు బిసిలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి, బిజెపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి నేతలు మాటల యుద్దం చేయడంతో ఉత్తరమండల జోనల్ కమీషనర్ హరిచందన సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా డిసి విజయరాజుతో వివిధ పార్టీల నేతలు వాగ్వివాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు మున్సిపల్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అంతటితో శాంతించని బిజెపి, టిడిపి నేతలు కార్యాలయం ముందు కొద్దిసేపు బైఠాయించి ఆందోళనకు దిగారు. డిసి విజయరాజు మాట్లాడుతూ బిసి సర్వే అనంతరం అన్ని పార్టీల నాయకులకు సర్కిల్ పరిధిలోని బిసి ఓటర్ల వివరాలను వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కూన వెంకటేశ్‌గౌడ్, మేకల సారంగాపాణి, బిజెపి నేతలు భవర్‌లాల్‌వర్మ, రవిప్రసాద్‌గౌడ్, ప్రభుగుప్త, వెంకటేశ్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆదం ఉమాదేవి, రజనీదేవి, తెరాస నుంచి ఆలకుంట హరి పాల్గొన్నారు.