జాతీయ వార్తలు

ఏప్రిల్ తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తీవ్ర నీటికొరత ఏర్పడిన దృష్ట్యా ఏప్రిల్ 30 తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని బాంబే హైకోర్టు బిసిసిఐ (్భరత క్రికెట్ కంట్రోల్ బోర్డు)ని బుధవారం ఆదేశించింది. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ‘పిచ్’లు తడిపేందుకు భారీగా నీటిని వృథా చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మే నెలలో మహారాష్టల్రో నిర్వహించాల్సిన 13 మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని కోర్టు ఆదేశించింది. మహారాష్టల్రో మ్యాచ్‌లకు అనుమతిస్తే 40 లక్షల లీటర్ల నీటిని కరవు ప్రాంతాలకు సరఫరా చేస్తామని, 5 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తామని బిసిసిఐ చేసిన ప్రతిపాదనలను కోర్టు త్రోసిపుచ్చింది. ఏప్రిల్ 30 తర్వాత మ్యాచ్‌లకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.