జాతీయ వార్తలు

భారత్ బంద్: ఉత్తరాదిలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో ఇటీవల చేసిన సవరణలను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం భారత్ బంద్ జరుగుతుంది. ఈ బంద్ వల్ల ఉత్తరాదిని ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బీహర్‌లో నిరసనకారులు రైళ్లను నిలిపివేశారు. యూపీ, మధ్యప్రదేశ్‌లలో దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. బీహర్‌లో ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు, పెట్రోల్ పంపులు మూసివేశారు. మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్‌లలో బంద్ జరిగింది. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.