జాతీయ వార్తలు
బీజేడీ అభ్యర్థిపై బాంబుదాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మాజీ మేయర్, సెంట్రల్ బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ నారాయన్ జెనాపై బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు. బీజేడీ తరపున భువనేశ్వర్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగిన జెనా... లక్ష్మీ సాగర్ ఝార్పాడా కెనాల్ రోడ్డు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చి, అతని కారుపై వరుసగా మూడు బాంబులు విసిరేసి పరారయ్యాడు. ఈ ఘటనలో అనంత నారాయణ జెనా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ బాంబు దాడితోభువనేశ్వర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.