జాతీయ వార్తలు

భార్యను కొట్టిన బీజేపీ నేత ..సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేత తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కార్యాలయంలో ఆమెపై చేయిచేసుకున్న వీడియో వైరల్ అవ్వటంతో ఆ నేతను సస్పెండ్ చేశారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో తన భార్య సరితా చౌదరిని భర్త అయిన మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆజాద్ సింగ్ ఈడ్చుకువెళ్లి కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భార్యను కొట్టిన మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆజాద్ సింగ్ ను తొలగిస్తూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చర్యలు తీసుకున్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మనోజ్ తివారీ హెచ్చరించారు.అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించినట్లు మనోజ్ తివారి చెప్పారు.