జాతీయ వార్తలు

రాహుల్‌తో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ నివాసానికి వెళ్లిన ఆయన వీణను బహుకరించారు. జాతీయ స్థాయిలో బీజేపేతర కూటమి ఏర్పాటు లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం విదితమే. ఇదే అంశంపై ఇరువురు చర్చలు జరుపుతారు. అలాగే తెలంగాణలో మహాకూటమి గురించి కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. రాహుల్‌తో భేటీలో చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు తదితరులు ఉన్నారు.