జాతీయ వార్తలు

బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె: బోరుబావిలో పడిన బాలుడ్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తెచ్చారు. మహారాష్ట్ర పూణెలోని ధోరందల్ గ్రామానికి చెందిన ఆరేళ్ల రవి పండిత్ ఖిల్ అనే బాలుడు నిన్న సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. ఆ సమయంలో బాలుడి తండ్రి కూలీ పనులకు వెళ్లాడు. కొంతసేపటికి తల్లి చుట్టుపక్కల గాలించి చివరకు బోరుబావిలో పడ్డాడని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బోరుబావి లోతు 200 అడుగులు. ఆ బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సమాంతరంగా గొయ్యి తవ్వి దాదాపు 16 గంటల తరువాత ఆ బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.