జాతీయ వార్తలు

జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌లో విశేషాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభకు సమర్పించారు. జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌లో విశేషాలు...
* మొత్తం బడ్జెట్‌ రూ.19.78లక్షల కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షలకోట్లు
* బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25వేల కోట్లు
* ముద్రా బ్యాంక్‌ ద్వారా రూ.లక్షా 80 వేల కోట్ల మేర రుణాలు
* ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
* 5 లక్షల రూపాయల వార్షికాదాయం ఉంటే పన్ను రాయితీ
* పోస్ట్ఫాసుల్లో ఎటిఎం సేవలు
* హౌసింగ్ లోన్లు తీసుకున్నవారికి వరాలు
* వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ.86,500 కోట్లు వ్యయం
* వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే లక్ష్యం
* నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీ
* పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500కోట్లు
* పంటల బీమో పథకం కోసం రూ.5,500 కోట్లు
* గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, సదుపాయాలకు ప్రాధాన్యం
* భూగర్భ జలాల పెంపునకు రూ.60వేల కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.87,765 కోట్లు
* ఉపాధిహామీ పథకానికి గతేడాది కంటే రూ.4వేల కోట్లు అదనంగా మొత్తం రూ.38,500 కోట్లు కేటాయింపు
* కుటుంబానికి రూ.లక్ష మేర బీమా
* వయో వృద్ధులకు రూ.30వేలు అదనంగా ఆరోగ్య బీమా
* పశు సంవర్థక శాఖకు రూ.850కోట్లు
* బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 పాఠశాలల ఏర్పాటు
* కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* పంచాయతీలు, పురపాలక సంఘాల కోసం రూ.2.87లక్షల కోట్ల గ్రాంటు
* స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియా కోసం రూ.500 కోట్లు
* అన్ని ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు
* అసంపూర్తిగా ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణకు రూ.150 కోట్లు
* చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యం
* అణు విద్యుదుత్పత్తికి రూ.3వేల కోట్లు
* వచ్చే మూడేళ్లలో పోస్టాఫీసుల్లో ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల పెంపు
* ఆధార్‌ ఆధారంగా సంక్షేమ పథకాల రాయితీల చెల్లింపు
* నిరామయి ఆరోగ్య బీమా పథకానికి సేవా పన్ను రాయితీ
* రూ.కోటి దాటిన ఆదాయంపై 15శాతం సర్‌ఛార్జి
* విలాసవంతమైన కార్లపై 1శాతం అదనపు పన్ను
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను 10 నుంచి 15శాతానికి పెంపు
* ఎక్సైజ్‌ పన్ను పెంపు నుంచి బీడీలకు మినహాయింపు.