జాతీయ వార్తలు

వచ్చేవి బులెట్ రైళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి- అహ్మదాబాద్ మధ్య తొలి రైలు
98వేల కోట్ల ప్రాజెక్టుకు జపాన్‌తో ఒప్పందం
రక్షణ, అణు ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు
సరికొత్త శిఖరాలకు ద్వైపాక్షిక సంబంధాలు
సంయుక్త ప్రకటనలో మోదీ, అబే స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత్ -జపాన్‌లు ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. కీలక రంగాలైన రక్షణ, అణు ఇంధన రంగాల్లో పలు ఒప్పందాలతోపాటు, ముంబయి- అహ్మదాబాద్ నగరాల మధ్య దాదాపు 98వేల కోట్లతో తొలి బులెట్ రైలు నెట్‌వర్క్ నిర్మాణానికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజే అబే మధ్య శిఖరాగ్రస్థాయి చర్చల అనంతరం ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలతోపాటుగా ఇరు దేశాలకు ప్రాధాన్యత ఉన్న పలు అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ‘్భరత దేశ ఆర్థిక స్వప్నాలను జపాన్ అర్థం చేసుకున్నంతగా ఏ మిత్ర దేశం కూడా అర్థం చేసుకోలేదు’ అని ఈరోజు సంతకాలు చేసిన ఒప్పందాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే వేగం, విశ్వసనీయత, సేఫ్టీకి మారుపేరయిన షింకాన్‌సెన్ ద్వారా ముంబయి- అహ్మదాబాద్ సెక్టార్‌లో హైస్పీడ్ రైలు ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికన్నా చరిత్రాత్మకమైన నిర్ణయం మరోటి ఉండదని కూడా ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం చాలా సులభమైన షరతులతో దాదాపు 1200 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక ప్యాకేజీని, సాంకేతిక సాయాన్ని అందిస్తున్న అబే ఉదారత ఎంతో ప్రశంసనీయమైందని ప్రధాని అన్నారు. అంతేకాక పౌర అణు ఇంధన సహకారానికి సంబంధించి తాము కుదుర్చుకున్న ఒప్పందం వాణిజ్య, స్వచ్ఛ ఇంధనంకన్నా మించినదని, పరస్పర విశ్వాసానికి, శాంతియుతమైన, సుభద్రమైన ప్రపంచం కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అది చెక్కుచెదరని నిదర్శనమని మోదీ అన్నారు.
బులెట్ రైలు నెట్‌వర్క్ దేశ ఆర్థిక రాజధాని ముంబయిని ప్రధాని సొంత రాష్టమ్రైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌తో అనుసంధానం చేస్తుంది. ఈ రెండు నగరాల మధ్య బులెట్ రైలుతో 505 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణ కాలం ఎనిమిది గంటలనుంచి మూడు గంటలకు తగ్గిపోతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 98వేల కోట్లుగా ఉంటుంది.
ఇరు పక్షాలు రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి ఒక ఒప్పందం, అలాగే రహస్య మిలిటరీ సమాచారం పరిరక్షణకు తీసుకోవలసిన సెక్యూరిటీ చర్యలకు సంబంధించి మరో ఒప్పందంపైనా సంతకాలు చేసాయి. ఈ ఒప్పందాలు తమ రక్షణ సహకారంలో ఓ మైలురాయి అని మోదీ అంటూ, ఇవి రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమేకాకుండా భారత్‌లో రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఇరువురు ప్రధానులు ఒక సంయుక్త ప్రకటనను కూడా జారీ చేసారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన వినియోగానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇరువురు ప్రధానులు ఆ సంయుక్త ప్రకటనలో స్వాగతించారు. అంతేకాకుండా అవసరమైన సాంకేతిక వివరాలు ఖరారైన తర్వాత ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని కూడా వారు స్పష్టం చేశారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధానికి గుర్తుగా 2016 మార్చి 1నుంచి జపాన్ పౌరులందరికీ ‘వీసా ఆన్ అరైవల్ (్భరత్‌కు రాగానే వీసా మంజూరు చేసే) సదుపాయాన్ని వర్తింపజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. కాగా, ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత పరిఢవిల్లాయని తనవంతుగా అబే అన్నారు. (చిత్రం) వారణాశిలో శనివారం గంగకు హారతినిస్తున్న జపాన్ ప్రధాని అబే, ప్రధాని మోదీ