జాతీయ వార్తలు

ఆర్థిక రంగానికి ముప్పేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న హెచ్చుతగ్గుల మార్పు భారత దేశ ఆర్థికాభివృద్ధిపై ఎటువంటి ప్రభావం చూపెట్టవని, పెట్రో ధరలపై సుంకాలను తగ్గించే ప్రసక్తిలేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో లీటర్ పెట్రోలు ధర రూ.80కు చేరుకున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓపెక్ దేశాలు అదనంగా చమురును ఉత్పత్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవడం, అమెరికా డాలర్ బలపడడం వల్ల తాజా సంక్షోభం తలెత్తిందన్నారు. ఇరాన్, వెనిజులా, టర్కీలో తలెత్తిన సంక్షోభాల వల్ల చమురు ధరలు పెరగడానికి కారణమన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని , చమురు ధరలు పెరిగినంత మాత్రాన ఆర్థిక రంగానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. దేశ వ్యాప్తంగా శనివారం చమురు ధరలు భగ్గుమన్న సంగతి విదితమే. దేశంలో తొలిసారిగా లీటర్ పెట్రోలు ధర రూ.80 దాటింది. ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ.80.38 పైసలు, డీజిల్ లీటర్ రూ. 72.51పైసలకు చేరింది. ప్రస్తుతం కేంద్రం పెట్రోలుపై లీటర్‌కు రూ.19.48 పైసలు, డీజీల్‌పై లీటర్‌కు రూ.15.33 పైసలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. పెట్రోధరలు పెరగడంతో విపక్షాలు ఈ నెల 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇక్కడ మూవ్ పేరుతో జరిగిన అంతర్జాతీయ మొబిలిటీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ద దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్‌ను రిటైల్ అవుట్ లెట్స్ వద్ద నెలకొల్పనున్నాయన్నారు. ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాల మీద చర్చ జరుగుతోందన్నారు. విద్యుత్ వాహనాల అభివృద్ధికి ప్రణాళికను కూడా ఖరారు చేశామన్నారు. ఈ వాహనాల వినియోగం వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. సౌర విద్యుత్ ద్వారానే విద్యుత్ వాహనాలను నడిపే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యుత్ కోసమని థర్మల్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తే కాలుష్య సమస్య తలెత్తుతుందన్నారు. సౌర విద్యుత్‌తో పాటు సహజవాయువు ఆధారిత విద్యుత్ ఉత్పాదనను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే పదేళ్లలో పదివేల జీఎన్‌జీ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు చెప్పారు. చమురు వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందన్నారు. సాలీనా ఐదు శాతం మేర చమురు వినిమయం పెరుగుతోందన్నారు. ఎల్‌ఎన్‌జీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో వౌలిక సదుపాయాల కల్పనకు చమురు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. దేశంలో 12 బయో రిఫైనరీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.