హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పార్టీ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం బిజెపి నగర శాఖ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడిడ అధ్యక్షతన పార్టీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నగర పదాదికారులు, నియోజకవర్గ కన్వీనర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నదని విమర్శించారు. నీటి పన్ను బకాయిల పేరిట 447 కోట్లు, విద్యుత్తు బకాయిలు 128 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఇవన్నీ కేవలం మజ్లీస్ పార్టీకి, పాతనగరానికి పరిమితం అయ్యేలా ఉన్నాయని అన్నారు. ప్రాపర్టీ టాక్స్ మాఫీ ప్రకటించడం కూడా ఎన్నికల ఎత్తుగడ అని ఆయన విమర్శించారు. ఇలాంటి వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి ఎన్నికల్లో లబ్ది పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడలను పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని, ప్రజల్లో ఎండగట్టాలని ఆయన సూచించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కార్యకర్తలను కోరారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ నాయకులు వెంకట రమణి, నాగురావు నామోజీ, శ్యాం సుందర్‌గౌడ్, రాజశేఖర్ రెడ్డి, భవర్‌లాల్ వర్మ, ఉమామహేంద్ర, ఎక్కాల నందు, శంకర్, రామన్‌గౌడ్, రమేష్ యాదవ్, బండారి రాధిక, మహేందర్ వ్యాస్, వైకుంఠం ప్రసంగించారు.