జాతీయ వార్తలు

ఈడీ విచారణకు హాజరైన చందాకొచ్చర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐసీఐసీ బ్యాంక్ మాజీ సీఇఓ చందాకొచ్చర్ ఈడీ ఎదుట నేడు విచారణకు హాజరయ్యారు. వీడియోఖాన్ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న ఆమె ఈ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం విచారణకు హాజరుకావాలని గత నెలలో ఈడీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, సోదరుడు రాజీవ్‌లకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే దీపక్, రాజీవ్‌లను విచారించిన ఈడీ అధికారులు నేడు చందాకొచ్చర్‌ను విచారించారు. 2012లో వీడియోకాన్ గ్రూప్‌ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో వారిపై మనీ లాండరింగ్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే.