జాతీయ వార్తలు

రేపు మోదీ క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎన్నాళ్లగానో అనుకుంటున్న కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరిందన్న ఊహాగానాలు దేశ రాజధానిలో వ్యాపించాయి. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి కొత్తగా కొందరికి తీసుకుంటారని, ఇంకొందరికి ఉద్వాసన చెబుతారని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారని తెలిసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న యుపి, ఉత్తరాఖండ్‌లకు చెందిన నేతలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం లభిస్తుందంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఇంతవరకూ ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలకూ అవకాశం ఉంటుందని తెలిసింది. పనితీరు సరిగా లేని ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించి, యువతకు ప్రాధాన్యం ఇస్తారని తెలిసింది.