సంజీవని

ఛాతిలో ఇబ్బంది.. సమస్యకు సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక, శారీరక ఒత్తిడులవల్ల ఛాతిలో ఇబ్బందిగా అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకుంటే అది తగ్గిపోతుంటుంది. దీనినే ‘ఎంజైనా’ అంటారు.
కొవ్వు, గుండెకి రక్తం సరఫరా చేసే నాళాలలో పేరుకుపోయి గుండె గోడలకు రక్త సరఫరా తగ్గడంతోబాటు, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుండడంతో ఎంజైనా కలగవచ్చు. అందుకనే ఎంజైనా కూడా ఒక విధంగా కరొనరి ఆర్టెరీ డిసీజే!
ఎంజైనా వస్తే ఛాతీ బిగుతుగా మారడం, గుండె మీద బరువు పెడితే ఎలాంటి నొప్పి కలుగుతుందో అలాంటి నొప్పి కలుగుతుంది. చాలామందికి చాలాసార్లు ఎంజైనా వచ్చి, విశ్రాంతి తీసుకోగానే తగ్గిపోతుండవచ్చు. గుండెపోటుకి దీనిని ప్రథమ దశగా భావించి వైద్యుడికి చూపించుకోవడం అవసరం. అపుడే ప్రారంభ దశలో గుండెపోటుని గమనించి ఇబ్బందిని గుండెపోటు రాకుండా సరిచేయించుకోగలం. ఎంజైనా వచ్చిన మగవాళ్ళలో 25 శాతం, ఆడవాళ్ళలో 15 శాతంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అయిదారేళ్ళలో గుండెపోటు వస్తోంది.
ఇలా నొప్పి వస్తున్నపుడు చిన్న పరీక్ష ఇసిజి చేయించడంతో గుండెలోని విద్యుత్తు ప్రవాహంలో తేడా వస్తుంటే దానిని గురించి సకాలంలో సరైన చికిత్సని పొందవచ్చు. గుండెకి అందాల్సినంత ఆక్సిజన్ సరిగా పొందకపోవడంవల్ల గుండెలో విద్యుత్ సరిగ్గా ప్రవహించక గుండె కొట్టుకోవడంలో తేడాలు వస్తాయి. ఇసిజి తీసేప్పుడు ఎంజైనాలు ఉంటేనే ఆ తేడాని గమనించగలం. కానీ సరిగ్గా ఇసిజితోనే గుర్తించలేనపుడు ‘స్ట్రెస్ టెస్ట్’ చేస్తారు. ఎక్సర్‌సైజ్ చేసేప్పుడు వరుసగా కొన్ని ఇసిజిలు ఈ పరీక్షలో తీస్తారన్నమాట. ఎంత తీవ్రంగా వుంది కూడా తెలుసుకోవచ్చు. అపుడు గుండెకి రక్తం సరఫరా చేసే ఎన్ని నాళాలలో అడ్డంకులేర్పడ్డాయి, అవి ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుని యాంజియోప్లాస్టీతో అడ్డంకుల్ని తొలగించవచ్చా, శస్తచ్రికిత్స అవసరమవుతుందా అనే విషయాన్ని హృద్రోగ నిపుణులు నిర్థారిస్తారు.
గతంలో ఈ యాంజియో తొడలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. ఇపుడు చేతిలోని రక్తనాళాల దఒఒఒఒ్వరా చేస్తున్నారని, దీనిని ‘రేడియల్ యాంజియో’ అంటారు. ఇలా యాంజియో చేయడంవల్ల రక్తస్రావం ఎక్కువగా ఉండదు. ఆసుపత్రిలో చేరనక్కర్లేదు. డేకేర్ ప్రాసెస్‌గా చేయించుకోవచ్చు. ఇపుడు యాంజియో ప్లాస్టీ ద్వారా గట్టి రక్తనాళాలు చీలే చోట వున్న అడ్డంకుల్ని తొలగించవచ్చు.
నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్‌ని నాలుక క్రింద ఉంచుకుంటే కరోనరి రక్తనాళాలు వెడల్పయి సమస్యకి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ఎంజైనాని తగ్గించడానికి ఇపుడు రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. బీటాబ్లాకర్ గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి గుండె కండరాలకు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తాయి. కాల్షియమ్ బ్రానల్ బాకర్స్ వాడడంవల్ల గుండెకి రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేస్తాయి.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638