సాహితి
చిలుక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిలుకల గుంపుకు
జాంకాయ ముక్కలు వేసారు
దూరపు కొండలు మురిపిస్తున్నాయి
యజమాని బడిలో పెరిగాయిగా అవే కూతలు!
మనకు పక్కోడిని చూసే వ్యూహమే లేదు
పేదోడి బతుకు చట్రంలో వేరే లోకమే లేదు
చీకటి... వెలుతురు లోకమంతా
రెండు మెతుకులు పొట్టలోకి వెళ్ళేందుకే
వచ్చే ఆదాయంలో
ఎన్ని రంగుల్ని నింపుకుంటారో
ఎన్ని ఆశల్ని రగిల్చుకుంటామో కదా?!
నిధుల వరదతో
సహకారం నెపంతో
వ్యూహాల చట్రంలో దేశాలు విలవిల
ఎర్ర, ఆకుపచ్చ రంగు పతాకాల
దేశాలనూ వదలలేదు
రెండు గ్రూపులై
మానవాళిని కాల్చుకుతింటున్న
రాక్షసులు ప్రజల బాగు కోరుతున్నారా?
దుప్పటి చాలు... ఏమీ వద్దన్న సైనికునికి
వందనం చేద్దాం
ఏమిచ్చాం దేశానికనేది సమీక్షించుకుందాం
నేలపై నిటారుగా నిల్చుని
దేశమా నేను నీకు పునరంకితమవుతానని
దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం!
మన చైతన్యంతోనే
మనంగా నిలబడదాం!