జాతీయ వార్తలు

కన్నతండ్రే నదిలో పడేసినా.. ఆ చిన్నారి బతికింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానే: బూట్లు కొనివ్వమని అడిగిన నేరానికి ఆరేళ్ల పాపను కన్నతండ్రే నదిలో పడేయగా.. ఆ చిన్నారి మృత్యువును జయించి క్షేమంగా ఇంటికి చేరింది. కర్కశ హృదయులను సైతం కదిలించే ఈ ఘటన మహారాష్టల్రోని థానే జిల్లాలో జరిగింది. ఆరేళ్ల పాప ఏక్తాతులసీరాం సైనీ తనకు బూట్లు కొనాలని అడగడంతో కోపగించుకున్న తండ్రి తన స్నేహితుడితో కలిసి ఆమెను బద్లాపూర్ వద్ద వాలివ్లి వంతెనపై నుంచి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నదిలో పడేశాడు. నదిలో బాగా పెరిగిన గుర్రపుడెక్క మొక్కలపై పడిన పాప ఆ రాత్రంతా అలాగే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడిపింది. నదిలో అంతగా నీరులేక పోవడం, గుర్రపుడెక్క విపరీతంగా పెరగడంతో ఆమె బతికిపోయింది. మర్నాడు ఉదయం వంతెన వద్ద విధులకు హాజరైన ఓ సెక్యూరిటీ గార్డు పాప ఏడుపు విని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి పాపను క్షేమంగా బయటకు చేర్చారు. పాప ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆమెను నదిలో పడేసిన తండ్రి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.