జాతీయ వార్తలు

భారత పౌరసత్వాన్ని వదులుకున్న మెహుల్ ఛోక్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన నిందితుడు మెహుల్ ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఆయనకు అంటిగ్వా పౌరసత్వం కూడా ఉంది. మెహుల్ ఛోక్సీకి రెండు పౌరసత్వాలు ఉండరాదని భారత విదేశాంగ ఆంక్షలు విధించటంతో ఆయన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి కారకుడైన నీరవ్ మోదీ మామగారైన ఛోక్సీ తన పాస్‌పోర్టును, 177 డాలర్లను భారత రాయబారి కార్యాలయంలో అందజేశారు. తనను భారత్ రప్పించేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఛోక్సీ ఇలా చేసినట్లు భావిస్తున్నారు.