జాతీయ వార్తలు

విభజన తీరు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభలో వాపోయిన వైఎస్ చైదరి * హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, నవంబర్ 30: ‘రాజ్యాంగం దుర్వియోగమైతే కాల్చి పారివేయండి’ అని రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను అపహస్యం చేస్తూ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అప్రజాస్వామికంగా విభజించిందని కేంద్ర సాంకేతిక సహాయ మంత్రి వై.ఎస్. చౌదరి వాపోయారు. రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో చేసిన ఈ చర్యవల్ల యుపిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో తుడిచి పెట్టుకు పోయిందని ఆయన రాజ్యసభలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని అప్పటి కేంద్రం ప్రభుత్వం ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ను విభజింవలసిందిగా ఆ రాష్ట్ర విధానసభ పంపిన తీర్మానాన్ని యుపిఏ ప్రభుత్వం బుట్టదాఖలు చేసి తన ద్వంద్వనీతిని నిరూపించుకుందని విమర్శించారు. పార్లమెంట్ తలుపులు మూసేసి ఎంపీలపై దాడి చేయించి, సభలో గందరగోళం సృష్టించి విభజన బిల్లుకు ఆమోదం పొందిన తీరు ప్రజాస్వామ్యానికే తలవంపుగా మిగిలిపోతుందని ఆయన దుయ్యబట్టారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో ఒకే విధంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక హామీలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరి హోదా, నిధులు ఇస్తామని చెప్పారు. విభజన జరిగి 18 నెలలు దాటిపోయినా ఒక్క హామీకూడా పూర్తిగా అమలు కాలేదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం చేసిన హామీలను విస్మరించటం భావ్యం కాదని ఆయన అన్నారు. చౌదరి ప్రసంగాన్ని అడ్డుకోవటానికి తెలంగాణకు చెందిన ఆనంద భాస్కర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.