జాతీయ వార్తలు

లోక్‌సభ వాయిదాకు కాంగ్రెస్ విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత గొడవ చేసినా వాయిదా వేయని స్పీకర్
విసుగు చెంది వాకౌట్ చేసిన కాంగ్రెస్ సభ్యులు

న్యూఢిల్లీ,డిసెంబర్ 17: కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఎంత గొడవ చేసినా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం లోక్‌సభను వాయిదా వేసేందుకు అంగీకరించటం లేదు. దీనితో విసుగు చెందిన కాంగ్రెస్ సభ్యులు గురువారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు సభ నుండి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు గురువారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించటం గురించి ప్రస్తావించారు. వారంతా పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కాంగ్రెస్ సభ్యులను శాంతింపజేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ప్రతిపక్ష సభ్యులకు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించారు. నినాదాల గొడవలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. జీరో అవర్‌లో కాంగ్రెస్ పక్ష నాయకుడు మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తారు. ఈ రోజు దీనికి విరుద్ధంగా వారు వాకౌట్ చేయకుండా జీరో అవర్ కొనసాగినంత సేపు కేంద్ర ప్రభుత్వానికి, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. స్పీకర్ జీరో అవర్‌తోపాటు 377 నోటీసు కింద చర్చను పూర్తి చేశారు.
మధ్యాహ్న భోజన విరామ సమయం తరువాత రెండు గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు కూడా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ఇవ్వటం ప్రారంభించారు. ఈ దశలో మల్లికార్జున ఖర్గే లేచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వ్యవహారాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. గవర్నర్ వ్యవహారంపై లోక్‌సభలో చర్చ జరిపేందుకు వీలు లేదని డిప్యూటీ స్పీకర్ తంబిదురై స్పష్టం చేశారు. ఖర్గే మాత్రం పలుమార్లు అరుణాచల్ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించారు. శాసనసభ వెలుపల సభ నిర్వహించి స్పీకర్‌ను తొలగించటం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తూ అనుమతి లేకుండా మాట్లాడేది ఏది కూడా రికార్డులలోకి పోదని స్పష్టం చేశారు. దీనితో ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ తరువాత సభ సాయంత్రం వరకు కొనసాగింది.