హైదరాబాద్

కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు టిఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్?
నాగేందర్‌తో పాటు అదేబాటలో మాజీలు

ఖైరతాబాద్, డిసెంబర్ 6: ఖైరతాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి... గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ బలాబలాలను విశే్లషించుకుంటూ వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంతో పాటు గ్రేటర్ పరిధిలో మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వారం రోజులుగా ఆయన వ్యవహారశైలి చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలే తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటారా? లేక టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరతారా? అనే అనుమానాలతో తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సోమవారం టిఆర్‌ఎస్‌లోకి వెళ్లనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
కొన్నినెలలుగా దానం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం జరిగినప్పుడల్లా తాను వెళ్లడం లేదని ఖండిస్తూ వచ్చారు. కాగా రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. లోలోన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకునే క్రమంలో ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. దానం తీరుతో ఇటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు టిఆర్‌ఎస్ నాయకుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలతో రహస్యంగా చర్చిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్న దానం నాగేందర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆయన అనుయాయుల ద్వారా తెలుస్తోంది. అయితే కొంతమంది మాజీ కార్పొరేటర్లు పార్టీ మారుదామని, మరికొందరు వద్దంటూ వారించినట్టు సమాచారం. మొన్న జరిగిన సమావేశంలో పార్టీ మారుదామని నిర్ణయానికి వచ్చిన దానం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రాకతో తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా భరోసా ఇచ్చిందా లేక టిఆర్‌ఎస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించక పోవడంతో పార్టీ మారే విషయాన్ని వాయిదా వేసుకున్నారన్న అనుమానాలను స్వయంగా కార్యకర్తలే బహిరంగానే పేర్కొంటున్నారు. దానం రాకతో ఇప్పటివరకు టిఆర్‌ఎస్‌లో హవా చెలాయించిన కొంత మంది నాయకులు తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలో పడ్డారు. మొదటి నుంచి పార్టీని పట్టుకొని ఎమ్మెల్యేగా పోటీచేసిన నాయకునితో పాటు ఎన్నికల అనంతరం పార్టీలో చేరిన మహిళా నాయకురాలు సైతం ఆందోళన చెందుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక తమదారి తాము చూసుకోవాలన్న నిర్ణయానికి సదరు మహిళా నాయకురాలు వచ్చినట్టు తెలుస్తోంది. దానం టిఆర్‌ఎస్‌లో చేరిన వెనువెంటనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. దానం వ్యవహారశైలితో ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు టిఆర్‌ఎస్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్ ఏవౌతుందోనన్న భయాందోళనలో పడ్డారు. ఏదైమైనప్పటికీ దానం చేరికతో ఖైరతాబాద్ రాజకీయంలో పెనుమార్పులు సంబవించే అవకాశం ఉన్నా, మరికొందరి రాజకీయ భవిష్యత్ శూన్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.